Chiranjeevi గాడ్‌ఫాదర్‌ : సత్యదేవ్ తో అంత నీచమైన సన్నివేశం చేయించారా?

NQ Staff - September 23, 2022 / 02:56 PM IST

160300Chiranjeevi గాడ్‌ఫాదర్‌ : సత్యదేవ్ తో అంత నీచమైన సన్నివేశం చేయించారా?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసింది. ఈ సినిమాలో యంగ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రలో నటించాడు. ఒరిజినల్ లూసిఫర్ సినిమాలో వివేక్ ఓబెరాయ్ పోషించిన పాత్రను గాడ్ ఫాదర్ లో సత్యదేవ్‌ పోషించాడు.

Godfather Satyadev Very Despicable scene

Godfather Satyadev Very Despicable scene

ఒరిజినల్ సినిమాలో వివేక్ ఓబేరాయ్ తన భార్య యొక్క మొదటి భర్త కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, కూతురు వరస అయినప్పటికీ డ్రగ్స్ అలవాటు చేసి ఆమెను అనుభవించేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సన్నివేశాలు కాస్త ఇబ్బందిగానే అనిపించాయి.. ఆ సన్నివేషాలను తెలుగులో ఉంచుతారా లేదా మార్పులు చేర్పులు చేస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఒకవేళ తెలుగులో కూడా చేస్తే సాఫ్ట్ హీరోగా ఇన్నాళ్లు మంచి పేరు సొంతం చేసుకున్న సత్యదేవ్ అలాంటి సన్నివేశాలు చేయించడం ద్వారా ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ సంపాదించుకున్నట్లు అవుతుందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ అత్యంత క్రూరమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు గతంలో పేర్కొన్నారు. కనుక ఆ అసభ్యకరమైన సన్నివేశాలను చూపించే ఉంటారు అనేది కొందరు అభిప్రాయం.

ఆ సన్నివేషాలను కనుక చూపిస్తే సత్యదేవ్ హీరో కెరియర్ పై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ వల్ల యంగ్ హీరో సత్యదేవ్ సినీ కెరియర్ ఇబ్బందుల్లో పడుతుందేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలకు మరికొన్ని రోజుల సమయం ఉంది కనుక అసలు విషయం ఏంటి అనేది సినిమా విడుదల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.