Ginna Movie : ‘జిన్నా’కి సీక్వెల్ ఆలోచనలో మంచు విష్ణు.!
NQ Staff - October 19, 2022 / 11:42 AM IST

Ginna Movie : మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన ‘జిన్నా’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో సన్నీలియోన్, పాయల్ రాజ్పుత్ ఇతర ప్రధాన తారాగణం.
సినిమా ప్రమోషన్లు గట్టిగానే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సన్నీలియోన్ అయితే ఈ సినిమాని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో సెంటరాఫ్ ఎట్రాక్షన్గా సన్నీలియోన్ కనిపిస్తుండడం గమనార్హం. సన్నీలియోన్ ముందర పాయల్ రాజ్పుత్ తేలిపోతోందనే చెప్పాలి.
సీక్వెల్ ఆలోచన వుందా.?
‘జిన్నా’ గనుక సక్సెస్ అయితే, సీక్వెల్ ఆలోచన చేస్తానని హీరో మంచు విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ మధ్య ప్రతి సినిమాకీ ఇలాంటి ప్రస్తావన వస్తోంది. నిజానికి, ఇది కొత్త వ్యవహారమేమీ కాదు. చాలా సినిమాల విషయంలో ‘సీక్వెల్’ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేసి, అందుకు అనుగుణంగా సినిమా చివర్లో ఓ హింట్ ఇచ్చేసి, చేతులు దులుపు కుంటున్నారు.
చాలా అరుదుగా మాత్రమే సీక్వెల్స్ వస్తుంటాయ్. మరి, ‘జిన్నా’ విషయంలో సీక్వెల్ ఆలోచన ఎంతవరకు నిజం.? అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ నెల 21న ‘జిన్నా’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అయితే, ‘జిన్నా’ సినిమాకి ప్రధానంగా డబ్బింగ్ సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతుండడం ఆశ్చర్యకరమైన విషయం.