Manchu Vishnu : ‘జిన్నా’ రిలీజ్ కి ముందే ఫ్లాప్ అని వాళ్లు రివ్యూలు ఇస్తున్నారు
NQ Staff - October 20, 2022 / 09:57 AM IST

Manchu Vishnu : మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు భారీగా ఉన్నాయి.
కానీ మా ఫ్యామిలీపై కొందరిలో ఉన్న వ్యతిరేకత కారణంగా ఈ సినిమా విడుదల కాక ముందే చెడు ప్రచారం చేయిస్తున్నారు అంటూ విష్ణు ఆవేదన వ్యక్తం చేశాడు. జిన్నా సినిమా తప్పకుండా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించే సినిమా అవుతుంది అంటూ ఆయన నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. మాపై ఉన్న దురాభిమానం మరియు కోపంతో కొందరు సినిమాను విడుదల కాక ముందే రివ్యూలు ఇచ్చి బ్యాడ్ గా ప్రచారం చేసే ఉద్దేశంతో ఒక బ్యాచ్ రెడీగా ఉంది అంటూ మంచు విష్ణు పేర్కొన్నాడు.
జిన్నా సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని, ప్రతి ఒక్కరిని నవ్వించే విధంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. స్క్రిప్ట్ చెబుతున్న సమయంలోనే మాకు చాలా బాగా నచ్చిందని ఆ సమయంలో చాలా నవ్వుకున్నామని అందుకే ఈ సినిమా చేసేందుకు వెంటనే ఓకే చెప్పాను అంటూ మంచు విష్ణు పేర్కొన్నాడు.
పాయల్ రాజ్పుత్ మరియు సన్నీలియోన్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించడంతో పాటు ఎంతో మంది ప్రముఖ నటినటులు కీలక పాత్రల్లో కనిపించారు కనుక ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని నమ్మకమును ఆయన వ్యక్తం చేశాడు. మంచు విష్ణు అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.