Ghantasala: సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. ఘంట‌సాల త‌న‌యుడు క‌న్నుమూత‌

Ghantasala: కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న వేళ సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు క‌న్నుమూస్తున్నారు. కొంద‌రు అనారోగ్యంతోను తుదిశ్వాస విడుస్తున్నారు. ప్ర‌ముఖుల మృతితో సినీ ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతి చెందుతుంది. తాజాగా ప్ర‌ముఖ గాయ‌కుడు ఘంట‌సాల వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న‌యుడు ర‌త్న‌కుమార్ క‌న్నుమూసారు. మ‌ధుర‌మైన గాత్రంతో వేలాది పాట‌లు పాడి అల‌రించిన ఘంట‌సాల ఈ కాలం నాటి గాయ‌కుల‌కు ఎంత‌గానో ఆద‌ర్శం. ఆయ‌న‌కు ముగ్గురు కుమారులు,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందులో ర‌త్న‌కుమార్ రెండోవారు. ఇత‌ను తప్ప మిగిలిన వారెవరూ సినీ రంగంలో అడుగుపెట్టలేదు.

Ghantasala Son Ratnakumar is No More
Ghantasala Son Ratnakumar is No More

ర‌త్న‌కుమార్ మొద‌ట్లో సింగ‌ర్‌గా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ, డబ్బింగ్ చెప్పే అవ‌కాశాలు ఎక్కువ రావ‌డంతో ఆ వైపు వెళ్లారు. ఇప్ప‌టి వ‌రకు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, సంస్కృత భాషల్లో 1090 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పారు . హీరోలు అర్జున్, కార్తీక్, అరవిందస్వామి, సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్‌లకు ఆయ‌న‌ ఎక్కువగా డబ్బింగ్ చెప్పేవారు. ఆట ఆరంభం, వీరుడొక్కడే, అంబేద్కర్ వంటి సినిమాల‌కు మాట‌లు కూడా అందించారు ర‌త్న‌కుమార్.

ర‌త్న‌కుమార్ డ‌బ్బిండ్ ఆర్టిస్ట్‌గా త‌న‌దైన ముద్ర వేసుకోగా, ద‌ర్శ‌కుడిగా మంచి సినిమా తీస్తాన‌ని చెప్పిన ర‌త్న‌కుమార్ ఆ కోరిక తీర‌క‌ముందే క‌న్నుమూసారు. ఒకానొక సంద‌ర్భంలో ద‌ర్శ‌కుడిగా సినిమా తీసేందుకు స్క్రిప్ట్, క‌థ సిద్ధం చేసుకుంటున్నాను. మంచి నిర్మాత దొరిక‌తే త‌ప్ప‌క సినిమా తీస్తాన‌ని అన్నారు. కొద్దిరోజుల క్రితం క‌రోనా బారిన ప‌డిన ర‌త్న‌కుమార్ ఈ మ‌ధ్యే కోలుకున్నారు.

చాలా రోజులుగా కిడ్నీసంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతుండ‌గా, ఆయ‌న కొన్ని రోజులుగా డ‌యాల‌సిస్‌పై ఉన్నారు. గురువారం ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో గుండెపోటు రావ‌డంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తూ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.

ర‌త్న కుమార్ కుమార్తె వీణ తాత వార‌సత్వాన్ని అందిపుచ్చుకుంది. తెలుగులో అందాల రాక్షసి, తమిళంలో ఉరుం చిత్రాల్లో నేపథ్య గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం పాటలు పాడుతూనే ఉంది. ర‌త్న కుమార్ ఆట ఆరంభం, వీరుడొక్కడే, అంబేద్కర్ వంటి సినిమాల‌కు మాట‌లు కూడా అందించారు ర‌త్న‌కుమార్. డబ్బింగ్ చెప్పడం చాలా కష్టమైన కళ. గాత్రం ఒక్కటే ప్రధానం కాదు. నటుల హావభావాలు, సన్నివేశానికి అనుగుణంగా భావాన్ని పలికించాలి. నటులకు, సాంకేతిక నిపుణులకు వస్తున్న గుర్తింపు డబ్బింగ్ అరిస్టులకు రావడంలేదు. ఈ రంగంలో నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది అని ఆయ‌న ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చారు.