Varun Tej మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆసక్తికరమైన స్క్రిప్ట్‌లని ఎంచుకుంటూ విభిన్న కథా చిత్రాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ముకుంద సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులని చేస్తున్నాడు. అందులో ఒకటి బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న గని కాగా, రెండో చిత్రం కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఎఫ్ 3. ఈ రెండు సినిమాల పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. గని చిత్రం వరుణ్ తేజ్ 10వ సినిమాగా బాక్సింగ్ డ్రామా నేపథ్యంలో రూపొందుతుండగా, ఈ సినిమాని కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు.
వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేసి తమ్ముడికి శుభాకాంక్షలు తెలియజేశారు. గని మోషన్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉందని కామెంట్ చేశారు. ‘బాలు’ సినిమాలోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్ర పేరు కూడా గని కావడంతో టైటిల్‌కు మంచి బజ్ వచ్చింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేష్ (బాబీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది.
గని చిత్రంలో కన్నడ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు వరుణ్ తేజ్ గుడ్ న్యూస్ చెప్పారు.జులై 30న రింగ్‌లో ఎంటరవుతాడని చెప్పుకొచ్చాడు. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న మూవీ గనీ సినిమాపై ప్రేక్షకలలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం వరుణ్ విదేశాలలో బాక్సింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.
💥💥🔥 all the best bro…🤗🤗 https://t.co/3KygBVi3Fn
— Anil Ravipudi (@AnilRavipudi) January 28, 2021