వ‌రుణ్ తేజ్ బ‌ర్త్‌డే గిఫ్ట్‌.. మోష‌న్ పోస్ట‌ర్‌తో మెగా ఫ్యాన్స్‌కు కిక్కిచ్చిన యువ హీరో

Samsthi 2210 - January 19, 2021 / 11:25 AM IST

వ‌రుణ్ తేజ్ బ‌ర్త్‌డే గిఫ్ట్‌.. మోష‌న్ పోస్ట‌ర్‌తో మెగా ఫ్యాన్స్‌కు కిక్కిచ్చిన యువ హీరో

మెగాస్టార్ చిరంజీవిని స్పూర్తి తీసుకొని ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వ‌రుణ్ తేజ్ మంచి క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటూ వరుస స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతున్నాడు. ఇటీవ‌లి కాలంలో ఎఫ్ 2, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం కొత్త ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో బాక్సింగ్ నేప‌థ్యంలో చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం వ‌రుణ్ తేజ్ అమెరికాకు వెళ్ళి బాక్సింగ్‌కు సంబంధించి శిక్ష‌ణ తీసుకున్నాడు.

వ‌రుణ్ కెరీర్‌లో 10వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీని అల్లు అరవింద్‌ సమర్పణలో రెనసాన్స్‌ ఫిలింస్‌, బ్లూ వాటర్‌ క్రియేటివ్‌ బ్యానర్స్‌ పై అల్లు వెంకటేవ్‌, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ భామ సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ రివీల్ చేశారు. గ‌ని అనే టైటిల్‌ని మూవీకి ఫిక్స్ చేసిన చిత్ర బృందం పోస్ట‌ర్‌లో వ‌రుణ్‌ని కొత్త‌గా చూపించారు. ఈ లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

క‌రోనా వ‌ల‌న చిత్ర షూటింగ్ వాయిదా ప‌డ‌గా, ఇటీవ‌ల తిరిగి ప్రారంభించారు. కొద్ది రోజులు షూటింగ్ పూర్తైన త‌ర్వాత వ‌రుణ్ తేజ్ క‌రోనా బారిన ప‌డ‌డంతో షూటింగ్ మ‌ళ్ళీ ఆగింది. ఇక క‌రోనా నుండి కోలుకున్న త‌ర్వాత వ‌రుణ్ తేజ్ ఇటు ఎఫ్ 3 సినిమాతో పాటు అటు గని సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్నాడు. ఈ రోజు వ‌రుణ్ తేజ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. జూలైలో చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జార్జ్‌ సి.విలియమ్స్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us