Getup Sreenu: గెటప్ శీను భార్యకు షాక్ ఇచ్చిన హ్యాక‌ర్స్.. !

Getup Sreenu: ప్రస్తుతం చిన్న సెలెబ్రిటీల నుంచి.. పెద్ద సెలెబ్రిటీల వరకు ఎవ్వరో ఒకర్ని సైబర్ హ్యాకర్లు బోల్తా కొట్టిస్తున్నారు. అయితే అంతే ఈజీగా పట్టుబడుతున్నారు. సోషల్ మీడియా అకౌంట్స్ ని హ్యాక్ చేస్తూ.. సెలెబ్రిటీలకు షాక్ ఇస్తున్నారు. ఇలా చాలామంది బుల్లితెర నటీనటుల అకౌంట్లు హ్యాక్ చేస్తున్నారు. అందులోనూ కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ తో అందరూ ఇంటికే పరిమితం కావడంతో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా మీదే ఆధారపడుతున్నారు. అటు వ్యక్తిగతంగానూ, ఇటు ప్రొఫెషనల్ గానూ ఉంటున్నారు. ఇదే అదునుగా అనుకుంటున్న సైబర్ నేరగాళ్ళు తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇలా ఎంతోమంది సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది ప్రొఫెషనల్స్ చేత రికవరీ చేయించుకుంటున్నారు. మరికొంతమంది తమ అకౌంట్లను క్లోజ్ చేసుకుని.. కొత్తవి క్రియేట్ చేసుకుని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్ లోకి లేటెస్ట్ గా బుల్లితెర నటుడు గెటప్ శీను భార్య సుజిత కూడా చేరారు.

Getup Sreenu's wife social media account hacked
Getup Sreenu’s wife social media account hacked

ప్రముఖ ఛానెల్ లో స్టాండప్ కామెడీ షో తో పాపులర్ అయిన గెటప్ శీను, ఆయన భార్య కూడా పలు మార్లు స్క్రీన్ మీద కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలా సుజిత కూడా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈమె ఆన్ లైన్ లో సుజిశ్రీస్ కలెక్షన్స్ పేరుతో అవసరమైన వస్తువులను సోషల్ మీడియా అకౌంట్స్ తో షేర్ చేస్తూ.. తన బిజినెస్ ని డెవెలెప్ చేసుకుంటున్నారు. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆమె బిజినెస్ పాపులర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అవ్వడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. గెటప్ శీను కూడా తన భార్య వీడియోలను షేర్ చేస్తూ.. సపోర్ట్ చేస్తున్నారు.

గతంలో జబర్ధస్త్ కమెడియన్ల అకౌంట్స్ హ్యాక్ అవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్రొఫెషనల్స్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. తమ అకౌంట్స్ కి సంబంధించిన పాస్ వర్డ్ లు, ఐడీ సెక్యూరిటీల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వేళ ఇతరులు హ్యాక్ చేసినా, అకౌంట్ ను రికవరీ చేసేలా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.