Getup Sreenu: జ‌బ‌ర్ధ‌స్త్ శీనుతో ఛార్మి ర‌చ్చ‌.. కుమ్మేద్దాం అంటూ ఇద్ద‌రు చిందులు

Getup Sreenu: ఒక‌ప్పుడు హీరోయిన్‌గా అల‌రించిన ఛార్మి ఇప్పుడు నిర్మాత‌గా స‌త్తా చాటుతుంది. పూరీ జ‌గ‌న్నాథ్‌తో క‌లిసి ప‌లు సినిమాలు నిర్మిస్తుంది. ప్ర‌స్తుతం లైగ‌ర్ అనే సినిమా చేస్తుండ‌గా, ఇందులో సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ, గ్లామ‌ర్ బ్యూటీ అన‌న్య పాండే ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

Getup Sreenu and Charmi Cooks Chicken Dish
Getup Sreenu and Charmi Cooks Chicken Dish

డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్, నిర్మాతలు కరణ్‌జోహార్, చార్మీల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘లైగర్‘.విజయ్ దేవరకొండ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ‘సాలా క్రాస్‌బీడ్‌‘ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. అయితే ఈ సినిమా కోసం ఛార్మీ చాలానే క‌ష్ట‌ప‌డుతుంది. అప్పుడ‌ప్పుడు క్రేజీ అప్‌డేట్స్ కూడా అందిస్తూ ఉంటుంది.

జూనియర్ ఆర్టిస్ట్‌గా, సైడ్ డాన్సర్‌గా సీరియల్స్ నటిగా కేవలం రూ. 200 రెమ్యునరేషన్‌కి పనిచేసిన ఛార్మి.. 13-14 ఏళ్ళకే అనుకోకుండా హీరోయిన్ అయ్యింది. ఆమె ఎలాంటి కష్టాలను అనుభవించి? హీరోయిన్‌‌గా ఎలా స్థిరపడింది? తిరిగి ఆమె కెరియర్ పీక్స్‌లో ఉన్న సందర్భంలో విధి ఆమెతో ఎలా ఆడుకుందో ప‌లు సంద‌ర్భాల‌లో తెలియజేసింది ఛార్మి.

షూటింగ్ స‌మ‌యంలో నన్ను పిక్ చేసి.. అభిషేక్ బచ్చన్ వెనకాల కూర్చోబెట్టి ఒక షాట్ తీశారు. షాట్ అయిన తరువాత అభిషేక్ బచ్చన్ టచ్ అప్ అవుతూ అద్దంలో నన్ను చూశారు. నువ్ చాలా అందంగా ఉన్నావు.. నువ్వెందుకు హీరోయిన్ కాకూడదని అన్నారు. అదే ఆమె హీరోయిన్ కావ‌డానికి తొలి మెట్టు అని పేర్కొంది.

అయితే లైగ‌ర్ చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేయాల‌ని భావిస్తున్న ఛార్మి ప్ర‌స్తుతం ఓవీడియో షేర్ చేసింది. ఇందులో గెట‌ప్ శీనుతో క‌లిసి చికెన్ క‌ర్రీ చేస్తుంది. నోరూరించే చికెన్ చూస్తూ కుమ్మేద్దాం అంటూ డ్యాన్స్‌లు వేశారు. వీడియో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.