Genelia: నా భ‌ర్త ఎనిమిది సార్లు కాళ్లు మొక్కాడ‌ని చెప్పిన జెనీలియా

Genelia: బాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ జెనీలియా-రితేష్ దేశ్‌ముఖ్ ఎప్పుడు నెటిజ‌న్స్ దృష్టిని ఆక‌ర్షిస్తూనే ఉంటారు. వీరిద్ద‌రు ఇన్‌స్టా రీల్స్‌లో చేసే అల్లరిని నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తారు. ముఖ్య‌గా జెనీలియా చేసే సంద‌డి మాములుగా ఉండదు. భర్త రితేష్ దేశ్‌ముఖ్‌ను ఏడిపిస్తూ.. పిల్లలతో ఆడుతూ-పాడుతూ జెనీలియా తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేస్తోంది.

Genelia

2003లో విడుదలైన ‘తుజే మేరీ కసమ్‌’ షూటింగ్‌లో వీరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఆపై పదేళ్లు డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2012లో ఇరు కుటుంబ సభ్యుల సమ్మతితో భార్యాభర్తలయ్యారు. ప్ర‌స్తుతం ఈ జంట‌ హిందీ బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘సూపర్ డ్యాన్సర్ చాప్టర్ 4’ షాది స్పెషల్‏లో అతిథిలుగా విచ్చేశారు. ఈ క్రమంలోనే జెనీలియ తన పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. రితేష్ దేశ్‏ముఖ్ వారి ఆచారంలో భాగంగా కాళ్లు ప‌ట్టుకున్న‌ట్టు చెప్పుకొచ్చింది.

షోలో న్యాయనిర్ణేతలుగా పాల్గొన్న జెనీలియా, రితేష్ .. తమ పెళ్లిలో జరిగిన తీపి గుర్తులను పంచుకున్నారు. డ్యాన్స్‌షోలో కంటెస్టెంట్ల ప్రతిభ చూశాక తమ పెళ్లిరోజు గుర్తొచిందని జెనీలియా చెప్పింది. ‘‘ మా పెళ్లిరోజు రితేశ్‌ నా కాళ్లను 8 సార్లు పట్టుకున్నాడని నవ్వుతూ చెప్పగానే వెంటనే మైక్‌ అందుకున్న రితేశ్‌.. దానికి కారణం పెళ్లి తర్వాత ఏం చేయాలన్నది అక్కడున్న పంతులకి ముందే తెలిసి ఉంటుంది.

అందుకే పెళ్లిరోజే వారు నాతో ప్రాక్టిస్‌ చేయించేశారు’’ అని చెప్పుకొచ్చాడు.దీంతో అక్క‌డ నవ్వులు విరబూశాయి. అయితే మహారాష్ర్ట వివాహ సంప్రదాయం ప్రకారం వధువు కాళ్లకు వరుడు నమస్కరించడం ఆచారం అనే విష‌యం తెలిసిందే.బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి..తన భర్త రాజ్ కుంద్రా అశ్లీల వీడియో చిత్రీకరణల కేసులో అరెస్ట్ కావడంతో.. ఆమె మీడియాకు దూరంగా ఉంటున్నారు.

గతంలో సూపర్ డ్యాన్సర్ చాప్టర్ 4 షోకు జడ్జ్ గా వ్యవహరించిన శిల్పా.. ఇప్పుడు ఈ షోకు న్యాయ నిర్ణేత‌గా ఉండ‌డం లేదు. దీంతో కరిష్మా కపూర్ గెస్ట్ జడ్జ్ గా కొనసాగుతోంది. అలాగే వీకెంట్ సర్ ఫ్రైజ్ గా జెనీలియా, రితేష్ జంట సూపర్ డ్యాన్సర్ షోలో సందడి చేశారు.