Genelia: మ‌తులు పోగొడుతున్న జెనీలియా.. ఈ వ‌య‌స్సులోను త‌ర‌గ‌ని అందం

Genelia: హ హా హాసిని’ అంటూ ‘బొమ్మరిల్లు’ తో తెలుగు ప్రేక్షకులకి ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ‌ జెనీలియా.బాలీవుడ్ యాక్టర్ రితేష్ దేశ్‌ముఖ్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఇద్దరు పిల్లల తల్లిగా పూర్తి టైం ఫ్యామిలీకే కేటాయించి బిజీ అయిపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.

TheNewsQube-
genelia lastest photoshoot4
genelia lastest photoshoot4

వర్కౌట్స్ దగ్గరినుండి పర్సనల్ విషయాలన్నిటినీ ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో జెనీలియాను 8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇటీవల ‘మా’ ఎలక్షన్స్‌లో తనకు మంచి ఫ్రెండ్ అయిన మంచు విష్ణుకి ఓటు వెయ్యడానికి హైదరాబాద్ వచ్చింది జెనీలియా. వీళ్లిద్దరూ కలిసి నటించగా సూపర్ హిట్ అయిన ‘ఢీ’ మూవీకి సీక్వెల్‌గా రాబోతున్నచిత్రంలో జెనీలియా నటించే అవకాశముందని తెలుస్తోంది.

genelia lastest photoshoot2
genelia lastest photoshoot2

బాయ్స్, సత్యం చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన జెనీలియా టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అల్లరి పిల్లగా జెనీలియా వెండితెరపై చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. క్యూట్ లుక్స్, నాజూకైన అందంతో యువతలో క్రేజీ హీరోయిన్ గా మారింది.

genelia lastest photoshoot1
genelia lastest photoshoot1

తెలుగులో జెనీలియా బొమ్మరిల్లు, సై, రెడీ,ఢీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి స్టార్ హీరోస్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ జెనీలియా స్టార్ హీరోల సరసన నటించిన ప్రతిసారి ఆమెకు నిరాశే ఎదురయ్యేది. ఆ చిత్రాన్ని నిరాశపరిచేవి. హ్యాపీ, సాంబ, ఆరెంజ్ చిత్రాలే అందుకు ఉదాహరణ.

genelia lastest photoshoot
genelia lastest photoshoot

2012లో జెనీలియా నటుడు రితేష్ దేశముఖ్ ని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు సంతానం. అయిన‌ప్ప‌టికీ తన గ్లామర్ కి మరింత పదును పెడుతోంది. సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. 34 ఏళ్ల వయసులో కూడా జెనీలియా నాజూకు అందంలో ఎలాంటి మార్పు లేదు. తాజాగా జెనీలియా క్యూట్ లుక్ లో మెరిసింది. ఈ పిక్స్ చూసి అభిమానుల మ‌తులు పోతున్నాయి.