Genelia: జెనీలియాని ఏడిపించిన అమితాబ్.. ఎందుకో తెలుసా?

Genelia: బొమ్మ‌రిల్లు బ్యూటీ జెనీలియా సినిమాలు చేయ‌క‌పోయిన తెగ ట్రెండింగ్‌లో నిలుస్తూ ఉంటుంది.సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తూ ర‌చ్చ చేస్తుంటుంది. కొద్ది రోజుల క్రితం టుడు అర్బాజ్ ఖాన్ హోస్ట్‌ చేస్తున్న డిజిటల్‌ షో ‘పించ్’ సీజన్ 2కి రితేశ్‌, జెనీలియా జంట అతిథులుగా వచ్చారు. ఈ జంటకి సైతం ఓ వీడియో చూపించాడు.

Genelia Got Emotional in KBC Show
Genelia Got Emotional in KBC Show

అందులో నటి ప్రీతి జింటాని రితేశ్‌ చేతులపై ముద్దు పెట్టకోగా, జెనీలియా జలసీతో చూస్తూ ఉంది. అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత జెన్నీ కోపంతో భర్తను కొడుతున్నట్లు, ఆయన వద్దు అని వేడుకుంటున్నట్లు ఉన్న ఆ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయ్యింది. అయితే ఈ వీడియోని చూసిన ఓ నెటిజన్‌ ‘సిగ్గు లేదా, వల్గర్‌ ఆంటీ. ఎప్పుడూ ఓవర్‌ యాక్టింగ్ చేస్తుంటావ్‌. ఇది నీ ముఖానికి సెట్‌ అవ్వదు’ అని కామెంట్‌ పెట్టాడు.

దీనిపై స్పందించిన నటి జెన్నీ ‘అతని ఇంట్లో పరిస్థితులు బాలేనట్లు ఉన్నాయి అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. భాయ్ సాబ్, మీరు ఇంట్లో బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను’ అంటూ ఘాటుగా స్పందించింది. ఇక తాజాగా త‌న భ‌ర్త‌తో కేబీసీ 13 షోకి హాజ‌రైంది.ఇందులో క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు సంబంధించిన వీడియోని రితేష్‌, జెనీలియా దంపతులకు చూపించారు అమితాబ్.

అది చూసిన ఆ పిల్లలు ఏం పాపం చేశారని ఇలాంటి శిక్ష అనుభవిస్తున్నారని జెన్నీ కంటతడి పెట్టింది. అది చూసిన రితేష్‌ సైతం ఎమోషనల్‌ అయ్యాడు. ఈ విషయమై ఇలాంటి మంచి పని కోసం కృషి చేస్తున్న అమితాబ్‌ని వారు ప్రశంసించారు.