Geetha Madhuri: బిగ్ బాస్ టాటూపై స్పందించిన గీతా మాధురి

Geetha Madhuri: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం ప్రేక్ష‌కుల‌ని అల‌రించడ‌మే కాదు ఇందులో పాల్గొన్న వారికి మంచి వినోదం క‌లిగిస్తుంది. బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో కంటెస్టెంట్స్‌కు ఇచ్చే కొన్ని టాస్క్‌లు చాలా ర‌స‌వ‌త్త‌రంగా ఉంటాయి. ప్ర‌తి సీజ‌న్‌లో ఒక‌రిని కాపాడాలంటే త‌ప్ప‌క బిగ్ బాస్ టాటూ వేయించుకోవాల‌ని చెప్ప‌డంతో కొంద‌రు త‌ప్ప‌ని ప‌రిస్థితుల‌లో బిగ్ బాస్ టాటూని త‌మ చేతిపై వేయించుకుంటూ వ‌స్తున్నారు.

Geetha Madhuri

బిగ్ బాస్ సీజ‌న్ 2లో హాట్ ఫేవ‌రేట్‌గా బ‌రిలోకి దిగిన గీతా మాధురి తొలి రోజు నుండి త‌న‌దైన శైలిలో గేమ్ ఆడుతూ వ‌చ్చింది. మ‌ధ్య మ‌ధ్య‌లో త‌న మాట‌లు, పాట‌ల‌తో అల‌రిస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేసింది. మ‌రోవైపు నిజాయితీగా ఉంటూ అభిమానుల దృష్టిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అయితే బిగ్ బాస్ షో త‌ర్వాత గీతా మాధురికి పెద్ద‌గా క‌లిసొచ్చిందేమి లేదు. సింగ‌ర్‌గా కూడా పెద్ద‌గా ప‌లు ఆఫ‌ర్స్ ఏమి రావ‌డం లేదు.

బిగ్ బాస్ సీజ‌న్ 2 ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన గీతా మాధురి ఓ షాపింగ్ మాల్ లాంచింగ్ కార్య‌క్ర‌మానికి హాజరైంది.ఆ కార్య‌క్ర‌మంలో బిగ్ బాస్ టాటూ త‌న చేతిపై ప‌దిలంగా ఉండ‌డంపై స్పందించింది. యాంకర్ మాట్లాడుతూ.. గీతా మాధురికి ఆఫ‌ర్స్ త‌గ్గిన‌ట్టు క‌నిపిస్తుంద‌ని అడ‌గ‌గా, ఫీమేల్ సాంగ్స్ ఎక్క‌డ వ‌స్తున్నాయ‌ని ప్ర‌శ్నించింది. క‌ళ్యాణ్ దేవ్ సినిమాకు తాను ప‌ని చేస్తున్న‌ట్టు పేర్కొంది.

ఇక బిగ్ బాస్ టాటూ ఉంచుకున్నారా, తీసేసారా అని ప్ర‌శ్నించ‌గా గీతా మాధురి త‌న చేతిపై టాటూ ఉన్న‌ట్టు చూపించింది. టాటూ వేసినందుకు ఫీల‌య్యారా అన్న ప్ర‌శ్న‌కు అది ఉంటుంద‌ని తెలిసే వేయించుకున్నాను. బిగ్ బాస్ షో నాకు ఎలాంటి బ్యాడ్ మెమోరీస్ ఇవ్వ‌లేదు కాబ‌ట్టి నేను దీని గురించి ఆలోచించ‌డం లేదు. సొసైటీకి నేనేంటో బిగ్ బాస్ షో ద్వారా తెలిసింది అని గీతా మాధురి చెప్పుకొచ్చింది.

సింగర్ గీతా మాధురి తెలుగు నాట పరిచయం అక్కర్లేని పేరు. తన గాత్రంతో పలు సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన గీతా, బాహుబలి టైటిల్ సాంగ్ ద్వారా బాగా పేరు పొందారు. సినిమా పాటలతో పాటు, స్టేజ్ షోలు, రియాలిటీ షోలతో పేరు సంపాదించుకున్న గీతామాధురికి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.