Nandu: డ్ర‌గ్స్ కేసు: ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన గీతా మాధురి భ‌ర్త‌

Nandu: టాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో ప‌లువురు సెల‌బ్రిటీల‌కు సంబంధించి ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి,ర‌కుల్ ప్రీత్ సింగ్‌ని విచారించ‌గా, కొద్ది సేప‌టి క్రితం ఈడీ ఎదుట సింగ‌ర్ గీతా మాధురి భ‌ర్త‌, హీరో నందు హాజరయ్యారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 20న నందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే.. ముందుగానే నందు విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్‌, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై నందును అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Geetha Madhuri husband Nandu Went to ED Office
Geetha Madhuri husband Nandu Went to ED Office

కెల్విన్, జీశాన్‌లతో నందుకు పరిచయం ఉందని, అందులో భాగంగానే డ్రగ్స్‌ వ్యవహారంపై ఈడీ ప్రశ్నిస్తుంది. ఎక్సైజ్ పోలీసులు ముందు నందు విచారణ జరుగుతోంది. కెల్విన్ ఇచ్చిన సమాచారం, కెల్విన్ మొబైల్ లోని కాంటెక్ట్ ఆధారంగా నందుకు ఈడీ సమన్లు ఇచ్చింది. మీడియా కళ్ళు గప్పి నందు విచారణకు హాజరైయ్యారు. బ్యాంక్ లావాదేవీలుపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

కెల్విన్ పరిచయాలు, డ్రగ్స్ కొనుగోలుపై ఎక్సైజ్ శాఖ ఇచ్చిన రిపోర్ట్ లో నందు పేరు వున్న విషయం తెలిసిందే. సాయంత్రం వరకు నందును ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. 2017లో ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ల ఆధారంగా.. డ్రగ్స్ వ్యవహారాల్లో ఆర్థిక లావాదేవీలు జరిగాయనే కోణంలో ఈడీ విచారణ జరుపుతోంది. మనీలాండరింగ్ మరియు ఫెమా రెగ్యులేషన్స్ ఉల్లంఘనల చట్టం కింద 12 మంది పలువురికి నోటీసులు జారీ చేసిన విష‌య్ తెలిసిందే.

డ్రగ్స్ కేసులో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాల గురించి నందు ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. మనీలాండరింగ్ జరిగిందా లేదా అనేది నిగ్గు తేల్చడానికి నందు బ్యాంక్ స్టేట్మెంట్స్ ను ఈడీ పరిశీలించనుంది. ఇప్పటికే నోటీసుల్లో ఈ విషయాలను తెలిపినట్లు సమాచారం. ఇకపోతే డ్రగ్స్ కేసు విచారణకు సెప్టెంబర్ 8న రానా దగ్గుబాటి – 9న రవితేజ మరియు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ – 13న నవదీప్ మరియు ఎఫ్ క్లబ్ పబ్ జనరల్ మేనేజర్ – 15న ముమైత్ ఖాన్ – 17న తనీష్ – 22న తరుణ్ ఈడీ ఎదుట హాజరు కానున్నారు.