geethamadhuri – samrat: బిగ్ బాస్ రెండో సీజన్లో గీతా మాధురి, సామ్రాట్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మొదట్లో సామ్రాట్ దీప్తి సునయన, తేజస్వీలతో క్లోజ్‌గా ఉంటూ వచ్చాడు. తనీష్, సామ్రాట్, దీప్తి, తేజస్వీలు ఒక జట్టుగా ఉంటూ వచ్చారు. కానీ చివరి వరకు సామ్రాట్, తనీష్ లు మాత్రమే మిగిలారు.అలా సామ్రాట్ చివరి వారాల్లో గీతా మాధురికి బాగా దగ్గరయ్యాడు. గీతా మాధురికి ఓ మాదిరిగా సామ్రాట్‌తో కలిసిపోయింది.
చేతులు పట్టుకోవడం, ఏదో పిచ్చిపిచ్చి రాతలు రాసుకోవడం, నిన్ను చూస్తుంటే నా భర్తను చూసినట్టు ఉంటుందని గీతా మాధురి అనడం, ఈ రిలేషన్ మీద బయట పెరిగిన నెగెటివ్ టాక్ ఆమెకు తెలియకపోవడంతో అలా బాగానే చేసింది. నందు బిగ్ బాస్ ఇంటి లోపలికి వెళ్లినప్పుడు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. బయట జరుగుతున్న ట్రోలింగ్ గురించి అర్థమయ్యేలా సిగ్నల్స్ ఇచ్చినట్టున్నాడు.
ఆ తరువాత కాస్త మాట్లాడుకోవడం తగ్గించారు. బిగ్ బాస్ షో గడిచాక సామ్రాట్, గీతా మాధురి కూడా అంతగా ఎక్కడా కలుసుకోలేదు. తాజాగా వావ్ షో కోసం మళ్లీ ఈ ఇద్దరూ కలిశారు. సాయి కుమార్ వావ్ షోలో గీతామాధురి, సామ్రాట్, దీప్తి, కల్పన వంటి వారంతా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ తాజాగా జరిగింది. షూటింగ్ గ్యాప్‌లో తీసిన వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
సామ్రాట్‌ను ఆడుకున్న గీతా మాధురి: geethamadhuri – samrat
గీతా మాధురి, దీప్తి, కల్పన ఓ కేరవ్యాన్‌లో కూర్చుని ఉండగా.. సామ్రాట్ ఎంట్రీ ఇచ్చాడు. సామ్రాట్ ఎంట్రీ ఇవ్వడంతో తన డ్రెస్‌కు సంబంధించి ఏదో సెట్ చేయమని అడిగింది. బిగ్ బాస్లొనూ ఇలాంటివి రోజుకు ఎన్నో ఇచ్చావ్ అని సామ్రాట్ అన్నాడు. మరీ ఎక్కువ చేస్తున్నావ్ కదా? అంటూ గీతా మాధురి ఆట పట్టించింది.