Geetha Arts : ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు గీతా ఆర్ట్స్ ఆర్ధిక సాయం

Geetha Arts : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసాయి. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో తిరుమల గిరులన్నీ జలపాతాల్లా మారాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి.

Geetha arts donation to andhra pradesh cm fund
Geetha arts donation to andhra pradesh cm fund

కనుచూపు మేరలో ఎక్కడ చూసినా వరద నీరే. వరద వెళ్లే కాలువలు చిన్నగా ఉండడం.. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో.. కాలనీలన్నీ నదుల్లా మారిపోయాయి. వాహనాలు, జంతువులు కళ్ల ముందే కొట్టుకుపోయాయి. ఇళ్లలోని సామానులు కాగితపు పడవల్లా నీటితో తేలియాడుతూ వెళ్లిపోయాయి. తిరుమల, తిరుపతిలో ఎప్పుడూ ఇలాంటి దృశ్యాలను చూడలేదని స్థానికులు తెలిపారు.

1996 తర్వాత ఈ స్థాయిలో వరదను ఎప్పుడూ చూడలేదని… ఇంతటి ప్రకృతి విపత్తును అంచ‌నా వేయ‌లేక‌పోయామ‌ని అన్నారు. ఈ వర్షాల ప్రభావం, సహాయక చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అయితే వ‌ర‌ద‌ల వ‌ల‌న న‌ష్ట‌పోయిన వారికి సాయం అందించేందుకు గీతా ఆర్ట్స్ ముందుకు వ‌చ్చింది. త‌మ సంస్త త‌ర‌పున సీఎం రిలీఫ్ ఫండ్‌కి ప‌దిల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించింది.

గడిచిన 50 ఏళ్లలో తిరుపతిలో ఇంతటి వర్షాలను చూడలేదని ప్రజలు అంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.