RRR: ఆర్ఆర్ఆర్ నుండి మ‌రో అప్‌డేట్‌.. ఏప్రిల్ 2న మ‌రో స్టార్ పాత్ర రివీల్ చేయ‌నున్న మేక‌ర్స్

RRR టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాల‌లో ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం) ఒక‌టి. జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ‌ర‌వేగంగా తెర‌కెక్కిస్తున్నారు. అక్టోబ‌ర్ 13న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన మేక‌ర్స్ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్క‌టిగా ఇస్తున్నారు. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, అలియా భ‌ట్, ఒలీవియా మోరిస్ పాత్ర‌ల‌కు సంబంధించిన ప‌వర్ ఫుల్ లుక్ రివీల్ చేసిన మేక‌ర్స్ ఇప్పుడు మ‌రో ప్ర‌ధాన పాత్రధారి అజ‌య్ దేవ‌గ‌ణ్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసే టైం ఫిక్స్ చేశారు.

బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇద్ద‌రు హీరోల‌కు గురువుగా, స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడిగా అజ‌య్ క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని పాత్ర‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్ క‌నిపించ‌నుండ‌గా, ఏప్రిల్ 2న ఆయ‌న బ‌ర్త్ డేను పుర‌స్క‌రించుకొని ఫ‌స్ట్‌లుక్‌తో పాటు మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్ర బృందం తెలియ‌జేసింది. సముద్రఖని, రే స్టీవెన్​సన్, అలీసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతమందిస్తుండగా, డీవీవీ దానయ్య సుమారు రూ.350 కోట్లతో నిర్మిస్తున్నారు.

Advertisement