Gauthami : సీనియర్ హీరోయిన్ కూతురు ఎంతలా మారిందో.. హీరోయిన్ గా రాబోతుంది!
NQ Staff - September 24, 2022 / 10:34 AM IST

Gauthami : తెలుగు మరియు పలు భాషల్లో నటించిన హీరోయిన్ గౌతమి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె కొంత కాలం వరకు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో సహజీవనం సాగించిన విషయం తెలిసిందే. ఇద్దరు భార్యా భర్తల మాదిరిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగారు.

Gauthami Daughter Subba Lakshami Photo Viral on Social Media
కానీ వారిద్దరి మధ్య విభేదాలు కారణంగా ఆ మధ్య విడి పోయారు.కమల్ తో విడి పోయిన తర్వాత నటి గౌతమి ఎక్కువగా మీడియాలో కనిపించడం లేదు. మళ్లీ ఇప్పుడు తన కూతురు కారణంగా మీడియాలో వచ్చింది. గౌతమి కూతురు సుబ్బు లక్ష్మి ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం నటిగా గౌతమి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది, ఈ సమయంలో తన కూతురు సుబ్బు లక్ష్మిని హీరోయిన్ గా పరిచయం చేసేందుకు ఆమె సిద్ధం అవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
సుబ్బ లక్ష్మి అందాల ఆర బోత విషయంలో ముందు ఉంటుంది అంటూ తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలను చూస్తుంటే అర్థమవుతుంది. తల్లికి తగ్గ కూతురు అన్నట్లుగా అందం విషయంలో మరియు మంచి బాడీ లాంగ్వేజ్ విషయంలో ఇప్పటికే మంచి మార్కులు సొంతం చేసుకుంది.
అతి త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు మరియు సౌత్ ఇండియన్ పరీక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. గౌతమి మాజీ హీరోయిన్ కనుక ఆమెకు ఉన్న పరిచయాలతో సుబ్బు లక్ష్మిని హీరోయిన్ గా పరిచయం చేయడం పెద్ద కష్టమేమీ కాదు.. అయితే ఆమె హీరోయిన్ గా ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.