Manjima Mohan: మ‌రో ప్రేమాయ‌ణం.. త‌మిళ హీరో ప్రేమ‌లో ప‌డ్డ చైతూ హీరోయిన్..!

NQ Staff - February 12, 2022 / 07:15 AM IST

Manjima Mohan: మ‌రో ప్రేమాయ‌ణం.. త‌మిళ హీరో ప్రేమ‌లో ప‌డ్డ చైతూ హీరోయిన్..!

Manjima Mohan: సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప్రేమ‌లు, పెళ్లిళ్లు, బ్రేక‌ప్‌లు చాలా కామ‌న్‌గా మారాయి. ఎవ‌రు ఎప్పుడు ప్రేమ‌లో ప‌డ‌తారో, ఎప్పుడు బ్రేక‌ప్ చెప్పుకుంటారో అర్ధం కాని ప‌రిస్థితి. ఈమధ్య కోలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల ప్రేమాయణాలు ఎక్కువయ్యాయి. ఒకట్రెండు సినిమాలు కలిసి చేసిన తర్వాత హీరో, హీరోయిన్ డేటింగ్ చేసే కల్చర్ సౌత్‌లో కంటే నార్త్‌లోనే కామన్ అయింది. కానీ ఆ కల్చర్ ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసినట్టుగా అనిపిస్తోంది.

Gautham Karthik and Manjima Mohan getting married soon?

Gautham Karthik and Manjima Mohan getting married soon?

ఇప్పుడు మంజిమ మోహ‌న్ త‌మిళ హీరోతో ప్రేమ‌లో ప‌డ్డ‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మంజిమ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విపిన్ మోహన్ మరియు డ్యాన్సర్ కళామండలం గిరిజల కుమార్తె. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. మలయాళ తమిళ చిత్రాలు చేస్తున్న మంజి మోహన్ తెలుగులో సాహసం శ్వాసగా సాగిపో చిత్రం చేశారు. ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు.ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించాడు.

Gautham Karthik and Manjima Mohan getting married soon?

Gautham Karthik and Manjima Mohan getting married soon?

మాంజిమ ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ నారా భువనేశ్వరీ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కాగా, ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో గౌతమ్ కార్తీక్‌తో ఆమె డేటింగ్ చేస్తోందట. దేవరట్టం అనే చిత్రంలో మాంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్ జోడీగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరికి పరిచయం అయింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారిందని సమాచారం.

వీళ్లిద్దరూ తమ ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో దేవరత్తమ్‌ సినిమా షూటింగ్‌ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అప్పటినుంచి వాళ్లిద్దరూ చెన్నైలో కలిసే ఉంటున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వాలంటైన్స్‌ డే రోజు వారి ప్రేమను అఫీషియల్‌గా వెల్లడించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.

ఇదిలా ఉంటే అలనాటి హీరో నవరస నయగన్‌ కార్తీక్‌ తనయుడే గౌతమ్‌ కార్తీక్‌. ప్రస్తుతం అతడు యుత సతం, పాటు తల సినిమాలు చేస్తున్నాడు. మంజిమ మోహన్‌.. ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఆమె నటించిన ఎఫ్‌ఐఆర్‌ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో విష్ణు విశాల్‌, రైజా విల్సన్‌, రెబా మోనికా తదితరులు నటించారు.

Read Today's Latest గుసగుసలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us