GANGAVVA: మూతి తిప్ప‌డంలో గంగ‌వ్వ‌తో పోటీ ప‌డ్డ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్.. వీడియో వైర‌ల్

ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్.. ఈ పేరుకి పరిచ‌యం అక్క‌ర్లేదు.క‌న్నుగీటుతో కోట్లాది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ప్రియా ప్ర‌కాశ్ .. నితిన్ హీరోగా తెర‌కెక్కిన చెక్ సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో అందాల ఆర‌బోత ప్ర‌ద‌ర్శించి ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకునే ప్ర‌య‌త్నం చేసింది. కాని ఆ ప్ర‌య‌త్నం స‌క్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు తేజ స‌జ్జాతో క‌లిసి న‌టించిన ఇష్క్ చిత్రంతో మ‌రోసారి త‌న అదృష్టం ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మైంది.

టాలీవుడ్ డెబ్యూ డైరెక్ట‌ర్ య‌స్‌య‌స్ రాజు తెర‌కెక్కించిన ఇష్క్ చిత్రంలో తేజ సజ్జా, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా, ఆర్‌బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్‌ జైన్, వాకాడ అంజన్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 23న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. చిత్ర రిలీజ్ మ‌రి కొద్ది రోజులే ఉండ‌డంతో మేక‌ర్స్‌తో పాటు ప్ర‌ధాన పాత్ర‌ధారులు మూవీపై అంచ‌నాలు పెంచేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇష్క్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌ల‌ని తీసుకొచ్చేందుకు తేజ ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డాడో ఫ‌న్ వీడియో ద్వారా చేసి చూపించారు. ఇది ఫ‌న్‌గా అనిపించింది.

ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఫేం గంగ‌వ్వ‌తో క‌లిసి ప్రియా ప్రకాశ్ ఫన్ వీడియో చేసింది. ప్రియా ప్ర‌కాశ్ క‌న్నుగీట‌డంలో స్పెష‌లిస్ట్ అన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మూతి తిప్ప‌డంలోను ప్రియా ప్ర‌కాశ్ రూటే స‌ప‌రేట్ అని ఈ వీడియో ద్వారా తెలియ‌జేసింది. కన్నుకొట్టుడు కాదు మూతులు తిప్పుడంటూ.. ప్రియాకు మూతి తిప్పుడు ట్రైనింగ్‌ ఇచ్చింది గంగ‌వ్వ‌. ఆమె ట్రైనింగ్‌లో ప్రియా ప్ర‌కాశ్ బాగానే మూతి తిప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌గా, ఇద్ద‌రి ప‌ర్‌ఫార్మెన్స్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ఇటీవ‌లి కాలంలో గంగ‌వ్వ‌ను సినిమా ప్ర‌మోష‌న్ కోసం బాగానే వాడుకుంటున్నారు. ఆ మ‌ధ్య నాగార్జున కూడా త‌న వైల్డ్ డాగ్ సినిమా ప్ర‌మోష‌న్ కోసం గంగ‌వ్వ‌తో క‌లిసి సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే.

Advertisement