GANGAVVA : గాలి మోటారు ఎక్కి గిర్రుగిర్రున తిరిగిన గంగ‌వ్వ‌.. వైర‌ల్‌గా మారిన వీడియో

GANGAVVA : ఆరు ప‌దుల వ‌య‌స్సులో బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టి సంచ‌ల‌నం సృష్టించిన మ‌ట్టి మ‌నిషి గంగ‌వ్వ‌. ప‌ల్లెటూరిలో పుట్టి పెరిగిన గంగ‌వ్వ ఇప్పుడు సెల‌బ్రిటీగా మారింది. మై విలేజ్ షో అనే యూట్యూబ్ కార్య‌క్ర‌మంతో పాపులారిటీ అందుకున్న గంగ‌వ్వ మెల్ల‌మెల్లగా సినిమాలు చేయ‌డం, సమంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి సెల‌బ్రిటీల‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌డంతో ఈమె జ‌నాలకు బాగా ద‌గ్గ‌రైంది. ఇక బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంలో ఓ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టే అవ‌కాశం కూడా ద‌క్కించుకుంది. కుర్రాళ్ల‌కు పోటీగా గేమ్ ఆడుతూ వ‌చ్చిన గంగ‌వ్వ అనారోగ్యంతో హౌజ్ నుండి నిష్క్ర‌మించింది.

హౌజ్‌లో ఉన్న‌న్ని రోజులు తెగ సంద‌డి చేసిన గంగ‌వ్వ ఈ షో వ‌ల‌న త‌న సొంతింటి క‌ల‌ను నిజం చేసుకుంది. బిగ్ బాస్ యాజ‌మాన్యం, నాగార్జున క‌లిసి గంగ‌వ్వ‌కు ఇల్లు క‌ట్టిస్తుండ‌గా, ఆ ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు రీసెంట్‌గా పంచుకుంది. ఇక శివరాత్రి సంద‌ర్భంగా వేములవాడ రాజ‌న్న ద‌ర్శ‌నంకు వెళ్లిన గంగ‌వ్వ‌కు హెలికాఫ్ట‌ర్ ఎక్కే ఛాన్స్ దొరికింది. టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్‌లో భాగంగా అక్క‌డ అందాల‌ను చూసేలా తెలంగాణ ప్ర‌భుత్వం హెలికాఫ్ట‌ర్ ఏర్పాటు చేయ‌గా, గంగ‌వ్వ గాలిమోటారు ఎక్కి గిర్రుగిర్రున తిరిగింది. ఈ ఎక్స్‌పీరియెన్స్ చాలా బాగుంద‌ని కూడా పేర్కొంది. ప్ర‌స్తుతం గంగవ్వ షికార్లు కొట్టిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. మీరు ఓ లుక్కేయండి.

Advertisement