Gangavva: గంగ‌వ్వ గృహ‌ప్ర‌వేశ వేడుక‌లో సంద‌డి చేసిన బిగ్ బాస్ స్టార్స్.. ట్రెండింగ్‌లో వీడియో

NQ Staff - November 9, 2021 / 01:59 PM IST

Gangavva: గంగ‌వ్వ గృహ‌ప్ర‌వేశ వేడుక‌లో సంద‌డి చేసిన బిగ్ బాస్ స్టార్స్.. ట్రెండింగ్‌లో వీడియో

Gangavva: గంగవ్వ తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. కూలీ పనులు చేసుకుంటూ చాలా క‌ష్టం చేసిన గంగ‌వ్వ మై విలేజ్ షో ద్వారా ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. అచ్చ తెలంగాణ యాసతో జనాన్ని ఆకట్టుకుంటూ.. తెలంగాణ పల్లె సంస్కృతికి ప్రతిరూపంగా కనిపిస్తుంది గంగవ్వ.

gangavva house warming (1)

gangavva house warming (1)

బిగ్ బాస్ సీజన్ 4లో పరిచయంలేని వాళ్ళను తీసుకురాగానే షో మీద విమర్శలు వెలువడే తరుణంలో కేవలం గంగవ్వ పార్టిసిపేట్ చేయడం వలన రేటింగ్ పరంగా దూసుకెళ్లిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. షోలోకి అడుగుపెట్టిన నాటి నుంచి గంగవ్వ తన ఆట తీరుతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది.

మట్టివాసన.. ఊర్లో ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉండే గంగవ్వ ఒకే దగ్గర కట్టేసినట్లు ఉండే బిగ్ బాస్ షోలో ఉండలేకపోయింది. దీంతో నాలుగు వారాలు నెట్టుకోచ్చిన గంగవ్వ.. ఐదవ వారంలో స్వయంగా బయటకు వచ్చేసింది. ఇక ఆ తర్వాత మళ్లీ యూట్యూబ్ వీడియోలలో నటిస్తూ వచ్చింది. షో నుంచి బయటకు వచ్చిన వారందరితో తిరిగి వీడియోలను క్రియేట్ చేస్తూ వచ్చింది.

తన ఇంటి నిర్మాణానికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్న గంగవ్వ..త్వ‌ర‌లో క‌ల నెర‌వేరుతుంద‌ని పేర్కొంది. తాజాగా గంగ‌వ్వ ఇంటి ప‌నులు పూర్తి కావ‌డంతో ఆమె కొత్తింట్లోకి అడుగుపెట్టింది. ఎట్టకేలకు తన కల నెరవేరినందుకు గంగవ్వ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ కార్యక్రమానికి బిగ్‌బాస్‌ ఫేమ్‌ అఖిల్‌, శివజ్యోతి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మై విలేజ్‌ షో టీం సభ్యులు సహా పలువురు హాజరయ్యారు. గంగవ్వ గృహప్రవేశానికి సంబంధించిన వీడియోను మై విలేజ్‌ షో టీం యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన కాసేపటికే ట్రెం‍డింగ్‌లో నిలిచింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us