Nagarjuna : యాంకర్ గా మారిన గంగవ్వ సుమనే డామినేట్ చేసింది..!
Vedha - March 26, 2021 / 10:27 AM IST

Nagarjuna : నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా గంగవ్వ పాల్గొంది. పెద్దదైన గంగవ్వ ని హౌజ్ మెట్స్ అందరూ బాగా చూసుకున్నారు. నాగార్జున కూడా తనని చాలా బాగా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత గంగవ్వ ఆరోగ్యం సహకరించకపోవడంతో హౌజ్ నుంచి పంపేశారు. అయితే గంగవ్వకి ఊరులో ఇల్లు కట్టిస్తున్నట్టు బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు నాగార్జున కూడా కొంత మొత్తం డబ్బు సహాయం చేశాడు. ఇలా గంగవ్వ బాగా ఫేమస్ అయింది.

gangavva-dominates-suma-in-anchoring
కాగా తాజాగా నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గంగవ్వ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలతో నాగార్జునని ఊపిరాడనీయకుండా ఉక్కిరి బిక్కిరి చేసింది. ఒకరకంగా చెప్పాలంటే తనేమీ కొత్త ప్రశ్నలు అడగలేదు. బయట అభిమానులు ఆనుకుంటున్న ప్రశ్నలే సూటిగా నాగార్జునని అడిగింది. మరి నాగార్జున .. గంగవ్వ నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ముందే ఊహించాడా లేదా తెలీదు గానీ సమాధానాలు మాత్రం అల్టిమేట్ గా ఇచ్చి అందరి డౌట్స్ క్లియర్ చేశాడు.
Nagarjuna : నాగార్జునని ఉక్కిరి బిక్కిరి చేసిన గంగవ్వ..?
ముందు వైల్డ్ డాగ్ సినిమా ప్రస్తావన తెచ్చిన గంగవ్వ ఆ తర్వాత నాగ చైతన్య – సమంత ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నారా? అని అడిగడంతో పాటు… ‘పెద్దకొడుకు కోడలు మనవళ్లని ఇస్తున్నారా?’ అని అడిగింది. దాంతో నాగార్జున నేను కూడా వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. నాగార్జున కూడా చైతు – సమంతలను.. వారసుడు కావాలని అడుగుతున్నట్టు చెప్పుకొచ్చాడు. తర్వాత.. చిన్నకొడుకు పెళ్లి ఎప్పుడు.. అంటూ అఖిల్ పెళ్ళి ప్రస్తావన తీసుకు వచ్చింది. అంతేకాదు మీరే సంబంధం చూడండి..లేదంటే నేను చూస్తా అంటూ చెప్పింది గంగవ్వ. మొత్తానికి యాంకర్ గా మారిన గంగవ్వ సుమనే డామినేట్ చేసే రేంజ్ లో ఇంటర్వ్యూ చేసింది.