Gangavva: చిరంజీవి తల్లిగా గంగవ్వ.. ఆశ్చర్యపోతున్న అభిమానులు
NQ Staff - October 4, 2021 / 04:11 PM IST

Gangavva: బిగ్ బాస్ సీజన్ 4లో 16వ స్పెషల్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ ఆ తర్వాత బిగ్ బాస్ లో అలరించి మరింత క్రేజ్ దక్కించుకోగా ప్రస్తుతం సినిమాల్లోనూ బిజీ అవుతున్నారు.

Gangavva as Megastar Chiranjeevi Mother in His Upcoming Movie
గంగవ్వ పూర్తి పేరు మిల్కూరి గంగవ్వ. జగిత్యాల జిల్లా. వర్షం వస్తే ఇళ్లంతా కురిసే ఇంట్లోనే ఏదో ఓ మూలకు సర్దుకుపోతూ.. పొలం పనులకు రోజు వారి కూలీగా వెళ్లే గంగవ్వ సెలెబ్రిటీ అయ్యి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టింది. జీవితాంతం బిడ్డల కోసమే కష్టపడిన గంగవ్వ ఈ వయస్సులో కూడా ఇంకా కష్టపడుతోంది. 2012లో గంగవ్వ మేనల్లుడు అయిన శ్రీకాంత్ శ్రీరామ్ పొలాల మధ్య, పల్లెటూరి నేపద్యం ఉన్న వీడియోలు చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసేవాడు. అలా గంగవ్వ కూడా ఆ వీడియోలలో నటించేది.
మొదట్లో అప్పుడప్పుడు మాత్రమే వీడియోలలో కనిపించేది, తరువాత ఆమె సహజత్వానికి, ఆ పల్లెటూరి తెలంగాణ యాసకి ఆమెకి ఫాలొవర్స్ పెరిగిపోయారు. ఆ తరువాత గంగవ్వ ‘మై విలేజ్ షో’ అనే యూట్యుబ్ చానల్‌తో యూట్యూబర్ అయింది. మై విలేజ్ షో ద్వారా తెలంగాణ గ్రామ సంస్కృతిని పరిచయం చేసింది. గంగవ్వ పల్లెటూరి నేపథ్యం అయినప్పటికీ సమాజం పట్ల ఆధునిక దృక్పథాన్ని కలిగి ఉంది.
యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ షోకేస్ హైదరాబాద్ 2018-2019 లో పాల్గొంది గంగవ్వ. ఇప్పుడు ఆమెకు బంపర్ ఆఫర్ తగిలినట్టు తెలుస్తుంది. చిరంజీవి- మోహన్ రాజా కాంబినేషన్‌లో రూపొందుతున్న మెగాస్టార్ చిరంఈజవి ర్ కి తల్లిగా నటించే పాత్ర గురించి.
ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి గారికి తల్లిగా గంగవ్వ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఊటి లో జరుగుతుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మోహన్ రాజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లిలిగా నటిస్తున్నవిషయం తెలిసిందే.