Drushyam: దృశ్యం పాప‌పై ఫ‌న్నీ కామెంట్స్ చేసిన యాంక‌ర్ శ్యామ‌ల‌

Drushyam:  విక్టరీ` వెంకటేష్‌ హీరోగా నటించిన దృశ్యం చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు `దృశ్యం2` రూపొంద‌గా, జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో మీనా.. వెంకీకి జోడిగా నటించారు. ఈ సినిమా ఈ నెల(నవంబర్‌ 25న) 25న సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు.

TheNewsQube-
funny moments with drushyam team.jpg
funny moments with drushyam team.jpg

ఆద్యంతం ఉత్కంఠభరితంగా ట్రైలర్‌ సాగుతూ ఆకట్టుకుంటోంది. అయితే యాంక‌ర్ శ్యామ‌ల దృశ్యంలో ఆరేళ్ల పాప‌గా క‌నిపించిన ఎస్త‌ర్ అనీల్‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. దృశ్యంలో ఆరేళ్ల‌పాప‌గా క‌నిపించావు. ఇప్పుడు ఆరేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ దృశ్యం 2లో క‌నిపిస్తున్నావు అని అడ‌గ‌గా, అమ్మ‌డు తెగ సిగ్గుప‌డిపోయింది.

ఈ చిత్రంలో వెంకటేష్‌, మీనాలతోపాటు తనికెళ్ల భరణి, నదియా, నరేష్‌, సంపత్రాజ్‌, కృతిక, జయకుమార్‌, ఎస్తర్‌ అనీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన ఎస్త‌ర్‌ చాలా క్యూట్ గా అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇప్పుడు ఆ చిన్నారి పెద్దదై హీరోయిన్‌గా మారేందుకు ప్రయత్నిస్తుంది. ఈ బ్యూటీ ఆ మ‌ధ్య‌ స్పెషల్‌ గౌనుతో ఫొటో షూట్‌ నిర్వహించింది. ఆ గౌను స్పెషల్‌ ఏంటంటే.. దాని బరువు.. ఆమె బరువు కంటే ఎక్కువ. ఎస్తర్‌ బరువు 44 కేజీలు. కానీ, ఆమె ధరించిన గౌను బరువు 58 కేజీలు.

దృశ్యం 2లో న‌టించిన ఎస్త‌ర్ ఈ సినిమాతో త‌నకు మ‌రిన్ని ఆఫ‌ర్స్ అందిపుచ్చుకునేలా ప్ర‌య‌త్నిస్తుంది. సోష‌ల్ మీడియాలోను
ఈ అమ్మ‌డు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తుంది. ఎస్త‌ర్ రానున్న రోజుల‌లో ఎంత‌గా రచ్చ చేస్తుందో చూడాలి.