Puneeth Rajkumar : పునీత్ మృతి త‌ర్వాత తొలి సారి స్పందించిన ఆయ‌న భార్య‌

Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత నెల29న కార్డియాక్‌ అరెస్ట్‌తో కన్నుమూయడంతో అభిమానులు విషాదంలో మునిగారు. కన్నడిగులు మాత్రమే కాకుండా పునీత్ మరణంపై దేశం మొత్తంలో సినీ ప్రేమికులు విచారాన్ని వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ సినీ సెలెబ్రిటీలు, ప్రేక్షకులు ఇలా అందరూ పునీత్ రాజ్ కుమార్ మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

TheNewsQube-
First time Puneeth Rajkumar wife respond
First time Puneeth Rajkumar wife respond

రీసెంట్‌గా పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. కన్నడ రత్న అవార్డుతో పునీత్‌కు నివాళిని అర్పించారు. అయితే తాజాగా ఆయన భార్య అశ్వినీ పునీత్ రాజ్ కుమార్ తాజాగా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు . అప్పు మరణంతో బాధ పడుతున్న అభిమానులకు ఎమోషనల్ మెసేజ్ ఇచ్చింది. అప్పు మృతి మా కుటుంబంకు మాత్రమే కాకుండా అభిమానులకు కూడా కన్నీరు మిగిల్చింది. అభిమానులు ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని ఆమె కోరింది.

First time Puneeth Rajkumar wife respond
First time Puneeth Rajkumar wife respond

పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన తర్వాత ఆయన కళ్లు దానం చేసిన విషయాన్ని తెలుసుకున్న ఎంతో మంది అభిమానులు ఇప్పుడు తమ కళ్లను దానం చేసేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈమద్య కాలంలో వందల కొద్ది రిజిస్ట్రేషన్ లు అవ్వడం అభినందనీయం అంటూ అశ్వినీ పేర్కొన్నారు.

పునీత్ చనిపోయిన విషయం ప్రతి ఒక్కరికి బాధను కలిగించింది. ఆయన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో ఆయన ఆశయాలను మరియు ఆయన ప్రారంభించిన పనులను తాను కొనసాగించబోతున్నట్లుగా కూడా ఆమె పేర్కొన్నారు.

అభిమానులు అధైర్యపడవద్దంటూ విజ్ఞప్తి చేసింది. అభిమానులకు అండగా తాను ఉంటాను అన్నట్లుగా హామీ ఇచ్చింది. అశ్విని సోషల్ మీడియా ఎంట్రీ ఇవ్వడం అప్పు అభిమానులు స్వాగతించారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య 50 వేలకు పెరిగింది. అప్పుపై ఉన్న అభిమానం ను అంతా కూడా అశ్విని పై చూపుతున్నారు.