NBK108 Movie : అనిల్ రావిపూడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్న బాలయ్య ఫ్యాన్స్‌

NQ Staff - March 22, 2023 / 08:21 PM IST

NBK108 Movie : అనిల్ రావిపూడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్న బాలయ్య ఫ్యాన్స్‌

NBK108 Movie : నందమూరి బాలకృష్ణ హీరోగా అఖండ, వీర సింహారెడ్డి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వచ్చి సక్సెస్ ని దక్కించుకున్న విషయం తెలిసిందే. దాంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న సినిమాతో బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ అభిమానులు చాలా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా దసరా కనకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేడు ఉగాది సందర్భంగా సినిమా నుండి ఫస్ట్ లుక్ వస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు మొదటి నుండి చెప్తూ వచ్చారు. అదే సమయంలో టైటిల్ ని కూడా రివీల్‌ చేసే అవకాశం ఉందని మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది.. కానీ నేడు బాలకృష్ణ యొక్క ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది కానీ టైటిల్ మాత్రం రిలీజ్ చేయలేదు.

దాంతో నందమూరి బాలకృష్ణ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ సినిమా టైటిల్ ఎందుకు విడుదల చేయడం లేదంటూ దర్శకుడు అనిల్ రావిపూడి పై తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తున్నారు.

 First Look Of NBK108 Movie Released But Title Not Been Released

First Look Of NBK108 Movie Released But Title Not Been Released

మరి కొందరు మాత్రం బాలకృష్ణ లుక్ కి ఫిదా అవుతున్నారు… ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నాం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు సంబంధించిన రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వక పోవడం పట్ల కూడా దర్శకుడు అనిల్ రావిపూడి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us