Rakul Preet Singh : ర‌కుల్ ఇంట్లో అగ్ని ప్రమాదం.. ప్రాణ హాని లేక‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్న అభిమానులు

Rakul Preet Singh : టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నివాసం ఉండే భవనంలో మంటలు చెలరేగాయి. శ‌నివార రాత్రి ముంబైలోని ఈ బిల్డింగ్‌లో 12వ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.

TheNewsQube-
fire accident in Rakul Preet Singh house
fire accident in Rakul Preet Singh house

ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా మంటలు రాజుకోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు. ప్ర‌స్తుతం ర‌కుల్ విదేశాల‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాతో తెలుగులో ఫస్ట్ హిట్ అందుకున్న రకుల్.. ఆ తర్వాత పలు బ్లాక్‌బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లోనూ పలు సినిమాలలో నటిస్తోంది.

ఇటీవలే తెలుగులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన కొండపొలం సినిమాలో నటించి ఆకట్టుకుంది. క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా.. ఈఏడాది తన పుట్టినరోజు సందర్భంగా.. రకుల్ తన ప్రేమ విషయాన్ని భయటపెట్టింది. నిర్మాత జాకీ భగ్నానీని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించి అందరికి షాకిచ్చింది ఈ ముద్దుగుమ్మ.

రకుల్‌ ప్రీత్‌సింగ్ దాదాపు పదేళ్లపాటు ఆడియెన్స్ ని అలరిస్తుంది. గ్లామర్‌తో మైమరపిస్తుంది. ముఖ్యంగా కమర్షియల్‌ సినిమాలకు బెస్ట్ ఆప్సన్‌గా నిలిచిన రకుల్ కి సక్సెస్‌లు తగ్గిపోయాయి. అదే సమయంలో ఆమె తెరపై కనిపించిన సందర్భాలు కూడా చాలా తక్కువే. కేవలం లవ్ ఇంట్రెస్ట్ గా కనిపించడంతో అవకాశాలు తగ్గిపోయాయి.

దీంతో బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది రకుల్‌. అక్కడ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతుంది. అయితే అక్కడ కూడా రకుల్ కి సక్సెస్‌ ఆమడ దూరంగా ఉండిపోతున్నాయి. ఇటీవల ఆమె నటించిన `మర్జావాన్‌`, `సిమ్లా మిర్చి`, `సర్దార్‌ కా గ్రాడ్సన్‌` చిత్రాలు పరాజయం చెందాయి. ప్రస్తుతం ఐదు హిందీ సినిమాల్లో నటిస్తుంది . ఈ సినిమాల రిజల్ట్ రకుల్‌ కెరీర్‌ ఆధారపడి ఉందని చెప్పొచ్చు.