Directors: ఈ లెజండ‌రీ ద‌ర్శ‌కులు క‌లిసి ప‌ని చేసిన సినిమాలేంటో తెలుసా?

Samsthi 2210 - June 14, 2021 / 01:35 PM IST

Directors: ఈ లెజండ‌రీ ద‌ర్శ‌కులు క‌లిసి ప‌ని చేసిన సినిమాలేంటో తెలుసా?

Directors: తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ సినిమా ముఖచిత్రాన్ని మార్చేసిన దర్శకులు మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ఈ ఇద్దరి నుంచి సినిమాలు వస్తున్నాయి అంటే బాక్సాఫీస్ దగ్గర రచ్చ రచ్చ అయ్యేది. ఒకానొక సమయంలో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసారు ఈ ఇద్దరూ. ముఖ్యంగా కెరీర్ మొదట్లో వరస విజయాలతో దూసుకుపోయారు.

Directors

అలాంటి ఈ ఇద్దరు సంచలన దర్శకులు కలిసి పని చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఓ వైపు మణిరత్నం.. మరోవైపు వర్మ.. కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు కలిసి పని చేసారు. ముఖ్యంగా 90ల్లో మణిరత్నం సినిమా వస్తుందంటే పిచ్చోళ్లలా ఎదురు చూసేవాళ్లు అభిమానులు. మరోవైపు వర్మ సినిమా అనౌన్స్ చేస్తే.. ఈసారి ఏం ట్రెండ్ సెట్ చేస్తాడో అనుకునేవాళ్లు. అలాంటి ఇద్దరు లెజెండరీ దర్శకులు కలిసి మూడు సినిమాలకు పని చేసారు.

90ల్లోనే వచ్చిన ఈ చిత్రాలు అద్భుతాలు చేసాయి. ఓసారి మణి సినిమాకు వర్మ పని చేస్తే.. మరోసారి వర్మ సినిమాకు మణి సాయం చేసారు. జగపతిబాబు హీరోగా వచ్చిన గాయం సినిమాను ఎవరూ అంత ఈజీగా మరిచిపోలేరు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాసింది మణిరత్నం. అలాగే మణి తెరకెక్కించిన తిరుడా తిరుడా సినిమాకు ఆర్జీవీ కథ అందించారు. అదే తెలుగులో దొంగ దొంగ పేరుతో విడుదలై విజయం సాధించింది.

Directors

షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన దిల్ సే సినిమాను మణిరత్నం తెరకెక్కించాడు. ఈ సినిమాను ఆయనతో కలిసి ఆర్జీవీ నిర్మించాడు. ఈ సినిమా కమర్షియల్ రిజల్ట్ పక్కనబెడితే సినిమా పరంగా బాగా వర్కవుట్ అయింది. అలా మణిరత్నం, ఆర్జీవీ లాంటి ఇద్దరు లెజెండరీ దర్శకులు కలిసి మూడు సినిమాలకు పని చేసారు.

ప్ర‌స్తుతం మణిరత్నం త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, ప్రకాశ్ రాజ్ నటిస్తుండగా ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్. ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. ఇక ఆర్జీవి హిట్‌,ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు.

Read Today's Latest Entertainment in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us