Bro Movie : ‘బ్రో’ షూటింగ్ ను పవన్ ఎన్నిసార్లు పూర్తి చేస్తాడు భయ్యా..!
NQ Staff - June 7, 2023 / 08:33 PM IST

Bro Movie : తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ్య సీతమ్ సినిమాను తెలుగు లో పవన్ కళ్యాన్ మరియు సాయి ధరమ్ తేజ్ ముఖ్య పాత్రల్లో బ్రో టైటిల్ తో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
గత నెలలోనే పవన్ కళ్యాణ్ యొక్క షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసినట్లుగా దర్శకుడు సముద్ర ఖని స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అంత త్వరగా పవన్ షూటింగ్ ముగించాడా అంటూ అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాబోయ్ పవన్ ఏంటి ఈ స్పీడ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తే మరి కొందరు మరో రకంగా కామెంట్స్ చేశారు.
ఆ విషయం పక్కన పెడితే తాజాగా మరోసారి చిత్ర యూనిట్ సభ్యులు పవన్ కళ్యాణ్ బ్రో షూటింగ్ కార్యక్రమాలు నేటితో పూర్తి అయ్యాయి అంటూ పేర్కొన్నారు. ఆ మధ్య చెప్పినట్లుగా పూర్తి చేయలేదా… కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేశారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈవిషయంలో యూనిట్ సభ్యుల స్పందన ఏంటో చూడాలి.
ఇక పవన్ మరియు సాయి ధరమ్ తేజ్ పోస్టర్ విడుదల అయినప్పటిన ఉండి కూడా ఈ సినిమా యొక్క విడుదల తేదీ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కేతిక శర్మ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా ను జులై చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా లో పవన్ మరియు సాయి ధరమ్ తేజ్ దేవుడు భక్తుడిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.