మార్చిలో మూత‌ప‌డ‌నున్న థియేట‌ర్స్.. మ‌రోసారి నిరాశ‌లో అభిమానులు..!

టాలీవుడ్ లో సినీ నిర్మాతలకు, తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు తమ డిమాండ్ లు నెరవేర్చకపోతే థియేటర్లు మూసివేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రముఖ స్టూడియోలో టాలీవుడ్ నిర్మాతలు.. తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ల మధ్య చర్చలు జరిగాయి. తమ డిమాండ్స్ ఒప్పుకోకపోతే మార్చి 1 నుంచి థియేటర్లు మూసివేస్తామని ఎగ్జిబిటర్స్ హెచ్చరించారు. మల్టీప్లెక్సుల్లాగా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా పర్సంటేజ్ సిస్టమ్ ను అమలు చేయాలని సూచించారు. పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలైన 6 వారాలకు.. చిన్న సినిమాలైతే 4 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు.. ఏషియస్ సినిమాస్ డీవీవీ దానయ్య, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.

లాక్ డౌన్ కారణంగా మూసుకుపోయిన థియేటర్లు.. 10 నెలల తర్వాత తెరుచుకున్నా ప్రేక్షకులు ఊహించినంతగా రాకపోవచ్చని అభిప్రాయపడిన విశ్లేషకులు.. ప్రేక్షకులు తెలుగు సినిమాల్ని ఆదరిస్తారని నిరూపించారు. దీంతో ఇప్పటి వరకు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలు, విడుదలకు ఈ ఏడాది వరుసగా క్యూ కట్టాయి. ఫిబ్రవరి నెల నుండి చిన్న సినిమాల దగ్గర్నుండి.. పెద్ద సినిమాల వరకు భారీ సంఖ్యలో విడుదలకు సిద్దంగా ఉన్నాయి. మునెపెన్నడూ లేని విధంగా 2021 లో సినిమాలు రాబోతున్నాయి. సినిమా లవర్స్ కి పండుగే అంటున్నాయి సినీ వర్గాలు.

ఇదిలా ఉంటే ఎగ్జిబిటర్ల డిమాండ్లను ప్రొడ్యూసర్స్ ఎంతవరకు నెరవేరుస్తారో చూడాలి. ఇవి కనుక ఒప్పుకోకపోతే థియేటర్లను నిలిపివేస్తామని చెప్పడంతో కాస్త ఆలోచనల్లో పడ్డారనే విషయం తెలుస్తుంది. ఈ విషయంలో నిర్మాతల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. దీంతో పాటు గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన షూటింగ్ లు మళ్ళీ ప్రారంభం కావడంతో.. ఆ పనుల్లో బిజీ ఉంటున్నారు సినీ నిర్మాతలు. అందుకే ఎగ్జిబిటర్స్ డిమాండ్స్ ని ఏ తీరులో చూస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement