అభి హారిక మధ్య చిచ్చు పెట్టిన నాగార్జున…మరింత పెరిగిన దూరం

Mamatha 600 - December 4, 2020 / 11:08 AM IST

అభి హారిక మధ్య చిచ్చు పెట్టిన నాగార్జున…మరింత పెరిగిన దూరం

బిగ్ బాస్ 89 వ ఎపిసోడ్ లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గంగవ్వ హౌస్ వీడి వెళ్లినప్పటి నుండి ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ ప్రేమ పక్షులు ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా గ్యాప్ పెంచుకుంటున్నారు. ఇక హౌస్ లో మూడు జంటలు ముఖ్యంగా మంచి ఆదరణ పొందుతున్నాయి. దాంట్లో మోనాల్అఖిల్, అభిజిత్హారిక, అరియనా అవినాష్ ఉన్నారు. ఇక ఈ మూడు జంటల మధ్య నామినేషన్ చిచ్చు పెట్టగా ఒకరి తర్వాత ఒకరు ఎడ మొహంతో ఉంటున్నారు. ఇన్నాళ్లు బాగానే కలిసి ఉన్న ఈ జంటల మధ్య చీలికలు రావడం ప్రేక్షకులకు సైతం ఎంతో బాధను మిగులుస్తుంది.

abhijeet harika

మనసులో మాట చెప్పలేని అభి

ఇక నామినేషన్ ప్రక్రియకు ముందు తర్వాత కూడా అఖిల్ మరియు మోనాల్ ఒక రేంజ్ లో గొడవలు పడుతుండగా, ఇప్పుడు అభిజిత్ మరియు హారిక వంతు వచ్చింది. గురువారం ఎపిసోడ్ లో అభి మరియు హరికల మధ్య పెరిగిన గ్యాప్ చాల క్లియర్ గా కనిపించింది. మొదట నాగార్జున కన్ఫెషన్ రూంలో అభికి ఫెవర్ గా ఆడుతున్నావ్ కాబట్టి వరెస్ట్ కెప్టెన్ అంటూ హెచ్చరించడం ఆమెలో మార్పుకు కారణం అయ్యింది. అదే మైండ్ సెట్ తో ఆడుతున్న హారిక , అభిని నామినేట్ సైతం చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో అభి తన మనసులో మాట చెప్పుకోవాలని చాల ప్రయత్నించినా హారిక వినడానికి సిద్ధం గా లేదు. అభి తన సమస్య ఏంటో చెప్పుకోవాలని హారిక తో మాట్లాడుతుంటే ఇంగ్లీష్ లో కాదు తెలుగులో మాట్లాడు అంటూ బిగ్ బాస్ రూల్ ని గుర్తు చేసింది. ఇక తాను ఆలా అడ్డుకోవడం వల్ల అభి తన సమస్యను అర్ధం చేసుకోవాడికి హారిక రెడీ గా లేదు అని తన పాయింట్ ని వినడం లేదని, అస్సలు విషయం చెప్పకుండానే నొచ్చుకొని వెళ్ళిపోతాడు.

అభి కి సారీ చెప్పిన హారిక

కాస్పెట్టి తర్వాత హరికి వెళ్లి అభి కి సారీ చెప్పిన అందుకే అభిజిత్ ఒప్పుకోలేదు. అయినప్పటికీ హారిక అయితే సరే అంటూ వెళ్ళిపోతుంది. ఇలా ఇన్ని రౌజుల పాటు ప్రేక్షకులను అలరించిన ఈ జంట బెస్ట్ కెప్టెన్ కాదు అంటూ నాగార్జున చెప్పిన తర్వాత విసిపోవడం మొదలయింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us