Rajamouli: రాజ‌మౌళితో సినిమా చేస్తే పేరు రాదంటూ రామ్ ల‌క్ష్మ‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Rajamouli: తెలుగు సినిమా స్థాయిని పెంచిన ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. బాహుబ‌లి సినిమా త‌ర్వాత రాజ‌మౌళి క్రేజ్ ప్ర‌పంచ స్థాయికి పెరిగింది. ఇప్పుడు ఆయ‌న సినిమాల‌పై అంద‌రి దృష్టి ఉంది. అయితే రాజ‌మౌళి సినిమాలో న‌టించాల‌ని, ఆయ‌న సినిమాల‌కు ప‌ని చేయాల‌ని టెక్నీషియ‌న్స్ అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన న‌టీన‌టులు కూడా రాజ‌మౌళి సినిమాలో చిన్న భాగం అయితే చాలని అనుకుంట‌న్నారు.

ram lakshman, Rajamouli

బాహుబ‌లి సినిమాలో క‌న్న‌డ స్టార్ సుదీప్ 10 నిమిషాలు కూడా లేని అస్లాం ఖాన్ పాత్ర పోషించాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ పాత్ర ఆర్ఆర్ఆర్ లో 15 నిమిషాలే అని తెలుస్తుంది. మ‌రి త‌క్కువ నిడివి ఉన్న సీన్స్‌కి కూడా వారు ఓకే చెబుతున్నారంటే రాజ‌మౌళి క్రేజ్ ఏ పాటిదో అర్దమ‌వుతుంది. అంద‌రు రాజ‌మౌళి సినిమాలకు ప‌ని చేయాల‌ని అనుకుంటుండ‌గా, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాత్రం రాజమౌళి సినిమాల‌కు ప‌ని చేయ‌డానికి ఇబ్బంది ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది.

తాజాగా రామ్ ల‌క్ష్మ‌ణ్ రాజ‌మౌళి సినిమాల‌కు ప‌ని చేయ‌డం ప‌ట్ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జక్కన్న సినిమాకు పని చేయడానికి తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని.. అయితే ఆయన సినిమాలకు పని చేయాలంటే ఒకేసారి 40 నుంచి 60 రోజుల వరకు డేట్స్ ఇచ్చేయాల్సి ఉంటుందని చెప్పారు. రాజ‌మౌళికి టైం లేదు అని చెప్ప‌డం అస్స‌లు న‌చ్చ‌దు. ఎప్పుడు అడిగితే అప్పుడు వెళ్లాలి అని అన్నారు. మ‌గ‌ధీర సినిమాకు పని చేసిన వారు బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ చిత్రాల‌కు ప‌ని చేయ‌లేదు.

ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా ప‌ని చేయ‌క‌పోవ‌డానికి కారణం డేట్స్ ఎక్కువగా ఇవ్వలేకపోవడమే అంటున్నారు ఈ ఫైట్ మాస్టర్స్. ట్రిపుల్ ఆర్ లోనూ ఇంటర్వెల్ ఫైట్ 10 రోజులు చిత్రీకరించామని.. అయితే చరణ్ కు దెబ్బ తగిలి అది 40 రోజులు అయిపోయిందని.. దాంతో తప్పుకోక తప్పలేదంటున్నారు ఈ బ్రదర్స్. రాజమౌళి సినిమాకు పని చేసినా కూడా ఫైట్ మాస్టర్స్ కు పెద్దగా పేరు రాదని.. అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటాడని అన్నారు.

70 శాతం స్టంట్స్ కూడా రాజమౌళి స్వయంగా చెప్పేస్తాడని దాని వ‌ల‌న మాకు చేసిన ఫీలింగ్ ఉండ‌దు అని అంటున్నారు రామ్ ల‌క్ష్మ‌ణ్‌. రాజ‌మౌళి సినిమాలకు ప‌ని చేసిన ఏ ఫైట్ మాస్ట‌ర్‌కు పేరు రాదు. క్రెడిట్ అంతా రాజమౌళికే వెళ్తుందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు వీళ్ళు. ఏదేమైన తెలుగు చిత్ర స్థాయిని పెంచిన రాజమౌళికి చేతులెత్తి న‌మస్క‌రించాలి అని అన్నారు రామ్ ల‌క్ష్మ‌ణ్‌.