Bigg Boss 5 Telugu: ఆడాళ్ల‌పై ప‌గ‌బ‌ట్టిన బిగ్ బాస్.. వారు న‌చ్చ‌డం లేదా?

Bigg Boss 5 Telugu బిగ్ బాస్ ప్ర‌స్తుతం తెలుగులో సీజ‌న్ 5 జ‌రుపుకుంటుంది. ఈ సారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్ లతో మొదలైంది బిగ్ బాస్. ఇప్ప‌టికే హౌజ్ నుండి ఆరుగురు ఎలిమినేట్ కాగా, ఈ రోజు మ‌రొకరు ఎలిమినేట్ కానున్నార‌ని అంటున్నారు. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి సిరి హన్మంతు, జస్మంత్ పడాల, లోబో, ఆర్జే కాజల్, ప్రియ, యాంకర్ రవి, అనీ మాస్టర్, శ్రీరామచంద్ర నామినేషన్‌లో ఉన్నారు.

ప్రియ, అని మాస్టర్ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. హాట్ స్టార్ యాప్‌లో నమోదైన ఓట్ల విషయానికి వస్తే ప్రియ, అని మాస్టర్‌కు పోటాపోటీగా ఓట్లు తెచ్చుకొన్నారు. కానీ మిస్డ్ కాల్ డేటా ప్రకారం ప్రియ పైచేయి సాధించారు. దాంతో ప్రియ ఏడో వారం ఎలిమినేట్ అయ్యారు.

 

దాంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఏడో వ్యక్తిగా ప్రియ మారారు. అయితే ఇంటి నుంచి ఇప్పటి వరకు ఆరుగురు మహిళా కంటెస్టెంట్లు వెళ్లిపోవడం అత్యంత చర్చనీయాంశమైంది . లహరి, హమీద, ఉమాదేవి, శ్వేత వర్మ, సరయు, ప్రియా… ఇలా వరుసగా ఆడోల్లని బయటికి పంపిస్తున్నాడు బిగ్ బాస్. దాంతో హౌస్ లో గ్లామర్ తగ్గిపోతోంది.

Bigg Boss Telugu5 Seventh Week Priya Eliminated
Bigg Boss Telugu5 Seventh Week Priya Eliminated

 

బిగ్ బాస్ షో మొద‌లై ఇప్ప‌టికే 50 రోజుల పూర్తైంది. ప్రస్తుతం హౌస్ లో కాజల్, అని, సిరి, ప్రియాంక సింగ్ ఫిమేల్ కంటెస్టెంట్లు ఉన్నారు. బిగ్ బాస్ కావాల‌నే ఆడ‌వాళ్లంద‌రిని పంపి మ‌గ‌వాళ్ల షోగా మారుస్తున్నారా అని తాజా ప‌రిస్థితుల‌ని చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. లేదంటే మరింత గ్లామర్ కోసం కొత్త కంటెస్టెంట్ లను వైల్డ్ కార్డు ద్వారా దింపుతారా అన్నది చూడాలి.

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. తొలి వారం సరయు రాయ్, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి షారి, నాలుగో వారం హమీదా ఖాతూన్, ఐదో వారం నటరాజ్ మాస్టర్, ఆరో వారం శ్వేతా వర్మ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు.