DANGAL: ఆఫ‌ర్స్ కావాలంటే ప‌డుకోమ‌న్నారు.. దంగ‌ల్ న‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సినిమా ఇండస్ట్రీ గురించి.. ఇక్కడ జరిగే అవమానాలు, అరాచకాల గురించి ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ముందుకొచ్చి మాట్లాడారు. అయితే అందులో సగానికి పైగా మంచి కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా మాట్లాడుతున్నారంటూ కొందరు సీనియర్స్ కూడా విమర్శించారు. మీటూ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని కావాలనే కొందరి పేర్లు నాశనం చేసే పని మొదలు పెట్టారని తెలిపారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం తమకు జరిగిన చేదు సంఘటనలను మీడియా ముందుకొచ్చి ధైర్యంగా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్‌ కూడా తనపై సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా బయట జరిగిన దాడి గురించి కూడా గుర్తు చేసుకుంది. తనపై సినిమాలో కాదు బయట నిజంగా దాడి జరిగిందని చెప్పుకొచ్చింది.

ఓ సారి తాను జిమ్‌ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఒకడు తనను ఫాలో అయ్యాడని.. ఎందుకు ఫాలో అవుతున్నావ్ అని అడిగితే నా యిష్టం.. అవుతాను.. చూస్తాను నీకెందుకు అంటూ చాలా కరుకగా సమాధానం చెప్పాడని తెలిపింది ఫాతిమా. కోపం వచ్చి అతని చెంప మీద కొడితే.. అతను కూడా తన మొహంపై గట్టిగా పంచ్ ఇచ్చాడని బాధ పడింది. దాంతో తాను కింద పడిపోయానని.. ఆ తర్వాత లేచి నాన్నకు ఫోన్ చేసి చెప్పేలోపు అతడు పారిపోయాడని చెప్పుకొచ్చింది ఫాతిమా. అది తన జీవితంలో మరిచిపోలేని చేదు సంఘటన అని చెప్పింది ఫాతిమా. ఇండస్ట్రీలోనూ తనకు చాలా చేదు సంఘటనలు ఎదురయ్యాయి అని చెప్పింది ఈమె.

కొంతమంది దర్శకులు అయితే బాగున్నావ్ చూడ్డానికి.. కానీ అవకాశాలు ఇవ్వాలంటే మాత్రం తమతో పడుకోవాల్సిందే అంటూ ఓపెన్ గానే అడిగేసారని చెప్పుకొచ్చింది ఫాతిమా సనా షేక్. కుదరదని చెప్పినందుకు తనకు అవకాశాలు రాకుండా చేసారని.. వచ్చిన ఛాన్సులు కూడా పోగొట్టే ప్రయత్నం చేసారని చెప్పింది. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి కూడా ఇలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నానని తెలిపింది ఫాతిమా సనా షేక్. ఈమె అమీర్ ఖాన్ దంగల్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. అలాగే థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమాలోనూ నటించింది.

Advertisement