Pawan kalyan : పవన్ కళ్యాణ్ కోసం తండ్రి కథ రాస్తే కొడుకు డైరెక్ట్ చేస్తాడా ..అయితే మళ్ళీ సంచలనమైన హిట్ …పాన్ ఇండియన్ సినిమా.. తప్పకుండా పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ కోసం కనీసం 2 ఏళ్ళు అయినా సమయం కేటాయించాల్సిందే.. ఇలాంటి టాక్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తోంది. అందుకు కారణం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ .. పవన్ కళ్యాణ్ కోసం కథ రాస్తున్నారని వార్తలు వస్తుండటమే. పవన్ కళ్యాణ్ కోసం విజయేంద్ర ప్రసాద్ కథ రాసేది నిజమే అయితే దర్శకుడు ఎవరు.. రాజమౌళి నా.. లేక మరొకరు దర్శకుడిగా బాధ్యతలు తీసుకుంటారా.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అందరిలో కలుగుతున్నాయట.

రాజమౌళి తీసిన బ్లాక్ బస్టర్స్ లో ఎక్కువ సినిమాలకి కథ అందించింది ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అని తెలిసిందే. మగధీర, ఛత్రపతి, విక్రమార్కుడు, బాహుబలి..ఇలా ఇండస్ట్రీ హిట్స్ …బాహుబలి లాంటి పాన్ ఇండియన్ సినిమాలు ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందినవే. ఇప్పుడు కూడా ఆర్ ఆర్ ఆర్ రాబోతోంది. అందుకే ఇప్పుడు తండ్రి విజయేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ కి కథ రాస్తే ఆ కథ పవన్ కళ్యాణ్ తో తీసేది కొడుకు రాజమౌళి అయితే మరో అద్భుతం రాబోతోందని అంటున్నారు. కాని ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా అన్నది ఇప్పుడే చెప్పలేము. రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ తర్వాత మహేష్ బాబు తో సినిమా చేయాల్సి ఉంది.
Pawan kalyan : పవన్ కళ్యాణ్ సినిమా చేసిన.. దర్శకుడు మాత్రం రాజమౌళి కాకపోవచ్చు..?
ఈ సినిమా కంప్లీట్ అయ్యే సరికి 2023 వచ్చేస్తుంది. అప్పటికి పవన్ కళ్యాణ్ మళ్ళీ రాజకీయాలలో బిజీ అయిపోతాడు. అదీ కాక రాకమౌళి తో సినిమా అంటే కనీసం ఓ రెండేళ్ళు లాకవ్వాలి. అంత సమయం పవన్ కళ్యాణ్ ఇవ్వగలడా..ఇవన్ని మిలియన్ డాలర్స్ ప్రశ్నలుగా ఉన్నాయి. అందుకే విజయేంద్ర ప్రసాద్ కథ తో పవన్ కళ్యాణ్ సినిమా చేసిన.. దర్శకుడు మాత్రం రాజమౌళి కాకపోవచ్చన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. కాగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్రిష్ సినిమాతో పాటు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. వకీల్ సాబ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.