Faria: ఐటెం సాంగ్‌తో అద‌ర‌గొట్టేందుకు సిద్ధ‌మైన జాతిర‌త్నాలు బ్యూటీ

Faria: `జాతిరత్నాలు` చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్ధుల్లా తెలుగు ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ని పెంచుకున్న సంగతి తెలిసినదే. ఫరియా నటించిన తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుని కుర్రకారులో క్రేజీ బ్యూటీగా వెలిగిపోయింది. ప్ర‌స్తుతం సినిమాలు లేని ఈ ముద్దుగుమ్మ‌కి సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెరిగింది. నాటి నుంచి ఎప్పటికప్పుడు ఇన్ స్టా లో అభిమానులకు టచ్ లో ఉంటూ అప్ డేట్స్ ఇస్తోంది ఫరియా.

TheNewsQube-
faria item song1
faria item song1

ఫ‌రియా థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు శిక్షణ పొందిన డ్యాన్సర్ కూడా. ‘జాతిరత్నాలు’ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ మంచు విష్ణు ‘ఢీ అంటే ఢీ’ అనే చిత్రంలో నటిస్తోంది. డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. తాజాగా ఫరియా అబ్దుల్లా ఓ ఐటెం పాటకు సంతకం చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ బ్యూటీ కింగ్ నాగార్జునతో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయనుందని సమాచారం.

నాగార్జున న‌టిస్తున్న “బంగార్రాజు”లో ఫరియా స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. వచ్చే నెలలో పాటను చిత్రీకరించనున్నారు మేకర్స్.’బంగార్రాజు’ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ ఈ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నాయి.

ప్రస్తుతం నాగార్జున, నాగ చైతన్య ఇద్దరూ ‘బంగార్రాజు’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ‘బంగార్రాజు’ను జనవరి 2022లో విడుదల చేయాలని భావిస్తున్నారు. మరోవైపు నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఘోస్ట్’ షూటింగ్ కూడా చేస్తున్నారు. అది 2022లో విడుదల కానుంది.

faria item song2
faria item song2

ఇక ఫరియాకు డాన్సు అంటే చిన్ననాటి నుంచి పిచ్చి… ఇప్పటికే కొన్ని డాన్సు వీడియోలను ఇన్ స్టాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వాటికన్నా తీన్మార్ డాన్సు మరింత వైరల్ గా మారుతోంది.