Faria Abdullah: చీర‌క‌ట్టుతో న‌డిరోడ్డుపై తీన్మార్ స్టెప్పులేసిన జాతిర‌త్నాలు బ్యూటీ

Faria Abdullah: జాతి రత్నాలు సినిమా చూసిన వాళ్ళకు ఫరియా అబ్ధుల్లా అనే యువ‌తి చాలా సుప‌రిచితం.ఇందులో చిట్టిగా అదిరిపోయే పాత్రలో నటించింది. ముఖ్యంగా యూత్‌కు ఈ పిల్ల నవ్వులు భలే నచ్చేసాయి. తొలి సినిమాతోనే భారీ హిట్‌ కొట్టేసిన‌ ఫ‌రియా అబ్ధుల్లాజాతిరత్నాలు సినిమాతో చిట్టిగా అలరించి ప్రేక్షకుల మనసును దోచుకుంది

Faria Abdullah Teenmaar Dance on Road
Faria Abdullah Teenmaar Dance on Road

జాతిర‌త్నాలు చిత్రంలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల అమాకత్వపు పనులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇక జాతిరత్నాలుతో నవీన్‌ పొలిశెట్టికి ఎంత క్రేజ్‌ వచ్చిందో.. ఫరియాకు అంతే వచ్చింది. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల‌ని అల‌రిస్తున్న ఫ‌రియా త‌న డ్యాన్సింగ్ స్టెప్పుల‌తో కేక పెట్టిస్తుంటుంది.

టాలీవుడ్‌ హీరోయిన్లలో అత్యంత పొడగరిగా మరో క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఫ‌రియా తాజాగా న‌డిరోడ్డుపై డ‌ప్పుల‌కు తీన్మార్ స్టెప్పులు వేసింది. ఫ‌రియా డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. డ‌ప్పులు సౌండ్ విని తాను ఆగ‌లేక‌పోయాన‌ని ఫ‌రియా చెబుతుంది.

ఫరియా బాలీవుడ్‌ చాన్స్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు మూడు కథలు కూడా విన్నట్లు వార‍్తలు వినిపిస్తున్నాయి. మంచు విష్ణు ప్రధాన పాత్రలో రాబోతున్న డీ సిక్వెల్‏లో ఫరియా నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక చేతిలో సినిమాలు లేకపోయినా.. ఫరియా మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‏గా ఉంటూ అల‌రిస్తుంటుంది.