Srinivasan: ఆసుప‌త్రిలో ప‌వ‌ర్ స్టార్.. ఆందోళ‌న చెందుతున్న అభిమానులు

Srinivasan: పవర్‌స్టార్ శ్రీనివాసన్ తమిళ సినీ పరిశ్రమలో ఫేమ‌స్ హాస్యనటులలో ఒకరు .2013 తమిళ చిత్రం ‘కన్న లడ్డు తిన్న ఆసయ్యాస‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పికప్ డ్రాప్’ సినిమా షూటింగ్‌లో ఉండగా అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయిన ఆయన ఇటీవలే ఆసుపత్రిలో చేరారు. నటుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

fan are worry about srinivasan (1)
fan are worry about srinivasan (1)

శ్రీనివాస్ ఆరోగ్య ప‌రిస్థితి కొంచెం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఆయ‌న ఆసుప‌త్రి వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఇది చూసి అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ట్వీట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం శ్రీనివాస‌న్ ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉంద‌నే దానిపై ఆసుప‌త్రి వ‌ర్గాలు ఇంకా ఏమి వెల్ల‌డించ‌లేదు

పవర్‌స్టార్ శ్రీనివాసన్ తనదైన నటనా శైలిని పెంపొందించుకున్నాడు మరియు అనేక మంది ప్రముఖ నటులతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నాడు. అతను చివరిగా యోగి బాబు నటించిన ‘నాగ రొంబ బిజీ’ చిత్రంలో కనిపించాడు.

కోలీవుడ్ పరిశ్రమలో సంచ‌ల‌నంగా మారిన‌ వనితా విజయ్ కుమార్ మూడు పెళ్లిళ్లు చేసుకోగా, అవి పెటాకులు అయ్యాయి .ఆ మ‌ధ్య తమిళ పవర్ స్టార్‌ శ్రీనివాసన్‌తో పూలదండలు మార్చుకుంటున్న స్టిల్‌ను సోషల్ మీడియాలో వదిలింది వనిత. ఆ ఫొటోకి నాలుగు లవ్ సింబల్స్ కూడా తగిలించింది. దీంతో అత‌డిని పెళ్లి చేసుకుంటుందా అనుకున్నారు

fan are worry about srinivasan1
fan are worry about srinivasan1

కాని ఆ ఫొటో సినిమాలో స్టిల్ అని.. నిజమైన పెళ్లి కాదని తేల్చేశారు. అయితే ఇప్పటికే పెళ్లి వార్తలతో హాట్ టాపిక్ అయిన ఈ భామకు ఈ పెళ్లి సరదా ఏంటో.. ఇంకెంతమందిని మారుస్తుందో అని ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు నెటిజన్లు.