Prabhas : ప్రభాస్ చేసే సినిమాలన్నీ కూడా రెండు పార్ట్ లు కావాలంటే ఎలారా బాబు?
NQ Staff - February 2, 2023 / 06:00 PM IST

Prabhas : ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సలార్ మరియు ప్రాజెక్ట్ కే గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త వార్త లేదా పుకారు మీడియాలో షికారు చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఆ మధ్య సలార్ సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నాడని, అందుకే షూటింగ్ ఆలస్యం అవుతుందని ప్రచారం జరిగింది.
ఇప్పటి వరకు ఆ విషయమై దర్శకుడు ప్రశాంత్ నీల్ అధికారికంగా ప్రకటించలేదు. మరో వైపు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్రాజెక్ట్ కే సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు ప్రముఖ మీడియా సంస్థలు కథనాలుగా రాస్తున్నాయి.
ఇప్పటి వరకు నాగ్ అశ్విన్ ఎప్పుడు సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించలేదు. మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వార్తలు క్రియేట్ చేసుకుని కథనాలు అల్లేస్తున్నారు.
ప్రభాస్ బాహుబలి సినిమా రెండు భాగాలుగా వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఆయన ఏ సినిమా చేసినా కూడా రెండు భాగాలుగా వస్తుందని ప్రచారం చేయడం పరిపాటి అయ్యింది. ప్రాజెక్ట్ కే రెండు భాగాల పుకార్లకు దర్శకుడు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇవ్వాలని ప్రభాస్ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.