రామ‌గుండంలో అడుగుపెట్టిన ప్ర‌భాస్.. ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన అభిమానులు

టాలీవుడ్ క్రేజీ రెబల్ స్టార్ ప్రభాస్ మరో రెండేళ్ళ వరకు ఫుల్ బిజీగా షూటింగ్స్ తో గడపడానికి సిద్దమయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మాత్రమే. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కి ఫ్యాన్స్ తో పాటు క్రేజ్ కూడా ఎక్కువే. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు ఈ హీరో. లేటెస్ట్ గా కేజీఎఫ్ డైరెక్టర్ తో కలిసి సలార్ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమయింది. ప్రస్తుతం కరీంనగర్ లో గోదావరిఖని ప్రాంతాల్లో ప్రభాస్ అభిమానుల జోరు హోరెత్తింది. ఇప్పటికే సలార్ కి సంబంధించి కొన్ని అప్డేట్స్ తో ఫ్యాన్స్ క్రేజ్ తో హోర్డింగ్ లు.. ఫ్లెక్సీలతో ప్రభాస్ కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.

కేజీఎఫ్ సినిమాతో తన కంటూ ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాంటి మాస్ ఎంటర్ టైనర్ డైరెక్టర్, ప్రభాస్ తో సినిమా అంటే ఏస్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సలార్ ఫస్ట్ షెడ్యూల్ రెగ్యూలర్ షూటింగ్ నిన్నటి నుండి ఫిబ్రవరి 12 వరకు జరగనుంది. రామగుండంలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ కాన్వాయ్ లో ప్రభాస్ ను రామగుండం బొగ్గు గనుల్లోకి తీసుకెళ్ళారు. ప్రభాస్ రాకతో ఆ ప్రాంతానికి జనం భారీ స్థాయిలో చేరుకున్నారు. ఈ సినిమాతో కన్నడ, తెలుగు, తమిళ భాషలకు చెందిన నూతన నటీనటులు కూడా పరిచయం కాబోతున్నారు.

ఇక ఈ సినిమాలో సౌత్ ఇండియన్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. రవి బస్రూర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. మొత్తానికి పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ కు ఫ్యాన్స్ ఏర్పడటం టాలీవుడ్ ప్రేక్షకులకు గర్వకారణం.

Advertisement