PAWAN KALYAN: పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై.. అభిమానుల ఆందోళన..

PAWAN KALYAN: జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన హెల్త్ కి సంబంధించిన లేటెస్ట్ బులెటిన్ రిలీజ్ చేయండి ప్లీజ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు జనసేన పార్టీ ఏప్రిల్ 16వ తేదీన అధికారికంగా ప్రకటించింది. అనంతరం ‘‘నా ఆరోగ్యం కుదుటపడుతుంది’’ అని పవర్ స్టార్ స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప ఆయన ఆరోగ్యంపై అప్డేట్లు రాలేదు. దీంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. వాళ్లు ఆశించినట్లుగా మెగా ఫ్యామిలీ నుంచి తాజా సమాచారం వస్తుందో రాదో చూడాలి.

Pawan Kalyan Health Condition

తిరుపతిలో ప్రచారం వల్లే..

తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికకు పవన్ కళ్యాణ్ బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి కె.రత్నప్రభ తరఫున ఏప్రిల్ 3వ తేదీన తిరుపతిలో పాదయాత్ర, భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. తర్వాత హైదరాబాద్ కి వచ్చి ‘వకీల్ సాబ్’ మూవీ ప్రిరిలీజ్ వేడుకలో మెరిశారు. అనంతరం ఒంట్లో నలతగా ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వాటిలో నెగెటివ్ అని వచ్చింది. అయినా వైద్యుల సలహాల ప్రకారం తన ఫాం హౌజ్ లోనే క్వారంటైన్ లోకి వెళ్లారు. అప్పటి నుంచి స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెట్టాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల తర్వాత మళ్లీ కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవటంతో పాజిటివ్ అని తేలింది.

Pawan Kalyan Health Condition

ట్రీట్మెంట్ ప్రారంభం..

ఖమ్మానికి చెందిన వైరల్ వ్యాధుల నిపుణుడు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ల సుమన్ హైదరాబాద్ వచ్చి పవన్ కళ్యాణ్ కి ట్రీట్మెంట్ ప్రారంభించారు. అవసరమైన పరీక్షలు చేయించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరటంతో యాంటీ వైరల్ మందులతో చికిత్స చేస్తున్నారు. అవసరమైతే ఆక్సీజన్ అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పట్ల ఆయన పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి, వదిన సురేఖతోపాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యవసాయ క్షేత్రంలోనే అవసరమైన వైద్య ఏర్పాట్లు చేస్తున్నారు. అపోలో హాస్పిటల్స్ మెడికల్ టీమ్ పవన్ కళ్యాణ్ ని పరీక్షించింది. డాక్టర్ శ్యామ్, డాక్టర్ సుబ్బారెడ్డి పవర్ స్టార్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇదంతా ఏప్రిల్ 16వ తేదీ నాటి పరిస్థితి. ఆ తర్వాత 18 రోజులు గడిచిపోయాయి. మధ్యలో రాజకీయ వ్యవహారాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ పేరుతో జనసేన పార్టీ మీడియా ప్రకటనలను వెలువరిస్తోంది గానీ ఆయన ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మాత్రం పంచుకోవట్లేదు.

Advertisement