Pawan Kalyan : పవన్ నటిస్తున్న సినిమాల్లో ఏ సినిమా ముందు వస్తుందో?
NQ Staff - January 30, 2023 / 07:00 PM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఒక వైపు జనసేన పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకు వచ్చేందుకు వారాహితో ప్రజల్లోకి వెళ్లాలని రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ మరో వైపు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. అందులో కొన్ని సినిమాలు ఇప్పటికే ప్రారంభం కాగా తాజాగా సాహో సుజిత్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి.
ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. మరో వైపు వినోదయ సిత్తం రీమేక్ మరియు సుజిత్ దర్శకత్వంలో సినిమాలు కూడా పట్టాలెక్కడంతో వీటిల్లో ఏ సినిమా ముందు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు సినిమా కంటే ముందు వినోదయ సిత్తం రీమేక్ లేదా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయట.
హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత కనీసం మూడు నుండి ఐదు నెలల పాటు విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన వర్క్ ఉంటుందట. కనుక ఆ సినిమా ఎప్పుడు వచ్చేది క్లారిటీ లేదు. అందుకే ఆ సినిమా కంటే ముందు ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందిస్తుంది.
పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం మొదట హరిహర వీరమల్లు సినిమా రావాలని కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ముందే ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు అన్నింటిని కూడా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడట.