Venkatesh : ఫెయిల్యూర్‌ సిరీస్‌ కి సీక్వెల్‌ అవసరమా?

NQ Staff - April 19, 2023 / 09:26 PM IST

Venkatesh : ఫెయిల్యూర్‌ సిరీస్‌ కి సీక్వెల్‌ అవసరమా?

Venkatesh  : వెంకటేష్ మరియు రానా కీలక పాత్రలో నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రేక్షకులకు విభిన్నమైన అనుభవాన్ని మిగిల్చింది. ఫ్యాన్స్ కొంత మంది బాగుంది అంటూ కామెంట్స్ చేస్తే ఎక్కువ శాతం మంది మాత్రం వెబ్ సిరీస్ పై పెదవి విరిచారు.

ప్రేక్షకులు ఎక్కువ శాతం అడల్ట్ కంటెంట్ ని ఒప్పుకోవడం లేదు. అయినా కూడా ఈ వెబ్ సిరీస్ కి సీక్వెల్ రాబోతుంది అంటూ నెట్ ఫ్లిక్స్‌ వారు అధికారికంగా ప్రకటించారు. ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన వెబ్ సిరీస్ కి సీక్వెల్ అవసరమా అంటూ చాలా మంది ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

ప్రేక్షకులు నచ్చని వెబ్‌ సిరీస్‌ ను మళ్లీ చేయాల్సిన అవసరమా వెంకటేష్‌ అంటూ కొందరు విమర్శించారు. అయినా కూడా వెంకటేష్ మరోసారి సీక్వెల్ కి ఓకే చెప్పడం ఆశ్చర్యంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వెంకీ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత ఈ కొత్త సిరీస్ మొదలయ్యే అవకాశం ఉంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us