Sreeleela : శ్రీలీల తస్మాత్‌ జాగ్రత్త.. బేబమ్మ పరిస్థితి నీకు?

NQ Staff - June 7, 2023 / 11:04 PM IST

Sreeleela : శ్రీలీల తస్మాత్‌ జాగ్రత్త.. బేబమ్మ పరిస్థితి నీకు?

Sreeleela : ఉప్పెన సినిమాతో స్టార్ హీరోయిన్గా తెలుగులో పేరు దక్కించుకున్న కృతి శెట్టి ఈ మధ్యకాలంలో వరుసగా పరాజయాల పాలవ్వడంతో అవకాశాలు దక్కించుకోవడమే కష్టంగా మారింది. ఉప్పెన సినిమా తర్వాత వరుసగా రెండు సినిమాలు సక్సెస్ అయిన కారణంగా కోటిన్నర నుండి రెండు కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసింది.

కానీ ఇప్పుడు కృతి శెట్టి 50 లక్షల రూపాయలకు కూడా సినిమాను చేసేందుకు అంగీకరిస్తుంది. వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఓకే చెప్పి ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలో కృతి శెట్టి యొక్క గుణపాఠంను మరో హీరోయిన్ శ్రీ లీల నేర్చుకోవాలంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మడు పెళ్లి సందడి సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. అయినా కూడా ఈమె అదృష్టం బాగుండే వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.

హీరోయిన్ గానే కాకుండా సెకండ్ హీరోయిన్గా కూడా ఈమె చేస్తుంది. ఈ సమయంలో కాస్త ఆఫర్స్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తే పర్వాలేదు కానీ అజాగ్రతగా ఉంటే మాత్రం కచ్చితంగా ఫలితం చేదుగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

శ్రీ లీల కొత్త సినిమాల ఎంపిక విషయంలో కథ దర్శకుడు ఇతర విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే కృతి కి పట్టిన పరిస్థితి నీకు పడుతుంది అని హెచ్చరిస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us