Sai Tej : వరుణ్ తేజ్ పెళ్లితో ఇరకాటంలో పడ్డ సాయితేజ్.. తాజా పోస్టుతో సంచలనం..!
NQ Staff - November 14, 2023 / 11:00 AM IST

Sai Tej :
వెంకీ పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనే సామెత ఊరికే పుట్టలేదండోయ్. ఇప్పుడు కొన్ని పరిస్థితులకు అది నిజంగానే అద్దం పట్టే విధంగా ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లి మెగా హీరోల బ్యాచిలర్ లైఫ్ కు పులిస్టాప్ పెట్టేలా రెడీ అయిపోయింది. ఇంతకీ విషయం ఏంటంటే.. వరుణ్ తేజ్ రీసెంట్ గానే తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠిని ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ లో ఆయన రిసెప్షన్ పార్టీని ఘనంగా ఇచ్చాడు. అప్పటి నుంచి మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. అయితే వరుణ్ తేజ్ ఇలా పెళ్లి చేసుకోవడం సాయిధరమ్ తేజ్ ఇరకాటంలో పడిపోయాడు.
ఎందుకంటే వయసు రీత్యా చూసుకున్నా సరే వరుణ్ కంటే సాయితేజ్ పెద్దవాడు. తనకంటే చిన్నోడైన వరుణ్ పెళ్లి జరిగిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి సాయితేజ్ పెళ్లి మీద పడిపోయింది. త్వరలోనే సాయికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు కూడా ఆరాటపడుతున్నారంట. ఇందుకోసం ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి సాయితేజ్ ఇప్పటికే చాలా ప్రేమ వ్యవహారాలు నడిపించాడు. కానీ అవన్నీ ఫెయిల్ అయినట్టు ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఓ సారి హీరోయిన్ రెజీనాతో పెళ్లి అని, మరోసారి రాశిఖన్నాతో అంటూ రకరకాల రూమర్లు వినిపించాయి.
కానీ అవన్నీఉత్తవే అని ఎప్పటికప్పుడు తేలిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సాయితేజ్ పెళ్లి ఎప్పుడు అనే చర్చ మొదలైంది. ఇక ఇంట్లో వారు సంబంధాలు చూడటం కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దానికి హింట్ ఇస్తూ సాయితేజ్ తాజాగా పోస్టు పెట్టాడు. ‘ఎందుకు, వై, క్యో, ఎన్ ? ఎంత పని చేశావ్ రా వరుణ్ బాబు.. నీకు పెళ్లి సంబరాలు..నాకు స్వతంత్ర పోరాటం’ అంటూ తేజు ఫన్నీ పోస్ట్ పెట్టాడు. స్వతంత్ర పోరాటం అంటే నేను సింగిల్ గా ఉండేదుకు పోరాడుతున్నా అని పరోక్షంగా తేజు చెప్పకనే చెప్పాడు. అయితే తాను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయినట్టు పరోక్షంగా హింట్ ఇచ్చాడు.

Family Members Want To Marry Sai Tej
చూస్తుంటే త్వరలోనే సాయితేజ్ గుడ్ న్యూస్ చెప్పే విధంగా ఉన్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం అతనికి ఇంట్లో వారు సంబంధాలు చూస్తున్నారంట. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో తర్వాత పెళ్లి అంటూ జరిగితే అది సాయితేజ్ దే అని తేలిపోతోంది. ఎందుకంటే తర్వాత లైన్ లో అతనే ఉన్నాడు.
ఇక అతని తర్వాత అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్ ఉన్నారు. వీరిద్దరి పెళ్లిళ్లు సాయితేజ్ తర్వాతనే జరగబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఓ రెండు సినిమా షూటింగుల్లో ఫుల్ బిజీగా ఉంటున్నాడు సాయితేజ్. చూడాలి మరి ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతాడో అనేది.