Mr. Bean: బ్ర‌తికుండ‌గానే మిస్ట‌ర్ బీన్‌ని చంపేశారుగా..!

Mr. Bean: ఒకప్పటితో పోలిస్తే టెక్నాలజీ వినియోగం నేటి కాలంలో విపరీతంగా పెరిగిందనే చెప్ప‌వ‌చ్చు. ఏ వార్త అయిన క్ష‌ణాల‌లోనే ఇత‌రుల‌కు చేరుతుంది. అయితే సమాచార వ్యవస్థ లో విప్లవాత్మకమైన మార్పులు రావడంతో మెల్లగా ఫోన్ మాధ్యమాల వినియోగం పెరిగింది. మొదట్లో ల్యాండ్ ఫోన్లు ఆ తర్వాత సెల్ ఫోన్ల, ఇక నేడు సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగింది. వీటి వ‌ల‌న కొంత మంచి జ‌రిగిన చెడు కూడా జ‌రుగుతుంది. కొందరు టెక్నాల‌జీని దుర్వినియోగం చేస్తూ పలు తప్పులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా బ్ర‌తికున్న సెల‌బ్రిటీల‌ను చంపేస్తున్నారు. ప్రముఖ గాయని ఎస్.జానకి, చంద్రముఖి సినిమా దర్శకుడు పి. వాసు అలానే ఇటీవల దివంగతుడైన వేణుమాధవ్ ,నితిన్ హీరోయిన్ మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, న‌టుడు ముఖేష్ ఖ‌న్నా ఈ జాబితాలో ఉన్నారు.

Mr. Bean

తాజాగా కామెడీకి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన మిస్ట‌ర్ బీన్‌ను కూడా చంపేశారు. డైలాగులు లేకుండా కేవ‌లం ఎక్స్‌ప్రెషన్‌తో న‌వ్వులు పంచిన న‌టుడు రోవాన్ ఎట్కిన్‌స‌న్ చనిపోయాడంటూ ఫేస్ బుక్‌లో వార్త వైర‌ల్‌గా మారింది. బ్రిటిష్ యాక్టర్ రోవాన్​ ఎట్కిన్​సన్​ అలియాస్​ మిస్టర్ బీన్ చనిపోయాడంటూ మే 29న వార్త ఫేస్​బుక్​లో స్ప్రెడ్ అయ్యింది. అది మిస్టర్​బీన్ ఫేస్​బుక్​ పేజీ కావడంతో ఆ వార్తను వేల మంది షేర్​ చేస్తారు. కాని అస‌లు విష‌యం ఏమంటే అది ఫేక్ పేజ్ అని, రోవాన్ బ్ర‌తికే ఉన్నాడ‌ని తెలిసింది. దీంతో నెటిజ‌న్స్ తిడుతూ కామెంట్స్ చేయగా, పేజీ నిర్వాహ‌కులు పోస్ట్‌ను డిలీట్ చేశారు.

Mr. Bean

మిస్ట‌ర్ బీన్‌గా చాలా పాపుల‌ర్ అయిన రోవాన్ తన మెస్మమరైజింగ్ యాక్టింగ్​తో మిస్టర్​ బీన్​ క్యారెక్టర్​ను ఒక ఐకానిక్​ క్యారెక్టర్​గా మారాడు. నైంటీస్​లో మిస్టర్ బీన్ క్యారెక్టర్​తో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు ఎట్కిన్​సన్​. పోగో ఛానెల్ ద్వారా మిస్టర్​ బీన్​ మన టీవీ ఆడియొన్స్​కు రీచ్​ అయ్యింది కూడా. 66 ఏళ్ల రోవాన్​ చనిపోయాడంటూ వార్తలు రావడం ఇదేం కొత్త కాదు కూడా. 2012, 2013, 2015, 2016, 2017, 2018.. ఇక ఇప్పుడు. ఇలా రోవ‌న్ మ‌ర‌ణ వార్త‌ల‌పై ప‌లు త‌ప్పుడు ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌డం ఆయ‌న అభిమానుల‌కి బాధ‌ను క‌లిగిస్తుంది. రోవాన్​ ఎట్కిన్​సన్, బ్రిటన్​ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్​ క్లాస్ మేట్ అన్న సంగ‌తి తెలిసిందే.