Faima : ఎటకారమొద్దు, అది ఎవరికీ ఇవ్వొద్దు: ఫైమాకి సీరియస్ వార్నింగ్.!

NQ Staff - November 24, 2022 / 06:41 AM IST

Faima : ఎటకారమొద్దు, అది ఎవరికీ ఇవ్వొద్దు: ఫైమాకి సీరియస్ వార్నింగ్.!

Faima : బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్‌లో కంటెస్టెంట్లతో వారి కుటుంబ సభ్యుల్ని కలిపే వ్యవహారం నడుస్తోందిప్పుడు. తాజా ఎపిసోడ్‌లో ఫైమాని ఆమె తల్లి కలిసింది. మిగతా కంటెస్టెంట్లందరితోనూ సరదాగా మాట్లాడిన ఫైమా తల్లి, ఆ తర్వాత ఫైమాతో విడిగా మాట్లాడింది.

‘నాన్న ఏడుస్తున్నాడు.. నువ్వు బాగా ఆడుతున్నావు. నువ్వు ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాడు నాన్న. వచ్చిన అవకాశం వదులుకోవద్దు. ఎవిక్షన్ ఫ్రీ కార్డు ఎవరికీ ఇవ్వొద్దు..’ అంటూ ఫైమాకి ఆమె తల్లి చెప్పింది.

మనంలో పాటేసుకున్నారు..

‘మనం’ సినిమాలోని పాటేశాడు బిగ్ బాస్.. హౌస్ మేట్స్ అంతా ఫైమా తల్లి షాహిదాతో కలిసి డాన్స్ చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసి ఎమోషనల్ అయిన కీర్తి, ఏడ్చేసింది.

కాగా, సత్యతో జాగ్రత్తగా వుండాలని ఫైమాని తల్లి షాహిదా హెచ్చరించింది. ‘కోపం తగ్గించుకో. ఎటకారం కూడా తగ్గించుకో. నామినేషన్లు వేసేటప్పుడు అప్రమత్తంగా వుండాలి..’ అంటూ ఫైమా తల్లి కొన్ని సూచనలు, ఇంకొన్ని వార్నింగ్స్ కూడా ఇవ్వడం గమనార్హం.

కోపం, ఎటకారం జనానికి నచ్చట్లేదనే విషయాన్ని ఫైమాకి ఆమె తల్లి కన్వే చేసింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us