Pushpa : పుష్ప విలన్ ని వదిలితే పట్టుకోవడం కష్టం.. అందుకే సుకుమార్ మొండిగా చేశాడు..!

Pushpa : పుష్ప సినిమాలో మెయిన్ విలన్‌గా ఫహద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి నటించాల్సిన పాత్రలో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నట్టు సమాచారం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండీయన్ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మైత్రీ మూవీమేకర్స్, ముత్యం శెట్టి మీడియా నిర్మాణ సంస్థలు కలిసి 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అల్లు అర్జున్‌కి కరోనా పాజిటివ్ వచ్చినా కూడా సుకుమార్ పుష్ప షూటింగ్ కంటిన్యూ చేశాడు.

fahad fajil left from pushpa shooting
fahad fajil left from pushpa shooting

ఈ నేపథ్యంలో సుకుమార్ మీద నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయినా సుకుమార్ మొండిగా పుష్ప చిత్రీకరణ జరిపాడు. అందుకు కారణం ఫహద్ ఫాజిల్. మాలీవుడ్ లో స్టార్ హీరోగా విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడ కాస్త కూడా ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఒక్కసారి అతని డేట్స్ మిస్ అయితే మళ్ళీ దొరకడం చాలా కష్టం. అందుకే సుకుమార్ ఇంత పట్టుదలగా పుష్ప షూటింగ్ జరిపారట. అయితే ఉన్నపలంగా ఫహద్ ఫాజిల్ షూటింగ్ నుంచి వెళ్ళిపోయాడట.

Pushpa : పుష్ప ఆగస్టు 13న భారీ స్థాయిలో 5 భాషల్లో రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదని తన భార్య కూడా ఇక్కడ నాని సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంటే ఇద్దరు ఇక్కడ చేస్తున్న సినిమాలకి బ్రేక్ ఇచ్చి వెళ్ళిపోయినట్టు సమాచారం. అయితే తనంతట తానే వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ త్వరలో డేట్స్ అడ్జెస్ట్ చేస్తాడని సుకుమార్ బృందం భావిస్తున్నారు. పుష్ప చిత్రీకరణ మెజారిటీ పార్ట్ ని వేగంగా పూర్తి చేశారట. సెకండ్ వేవ్ తగ్గితే మిగతా టాకీ పార్ట్ పూర్తి చేస్తారట. ఆగస్టు 13న భారీ స్థాయిలో 5 భాషల్లో రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement