F3: ఎఫ్ 3 సెట్‌లో క‌రోనా అల‌జ‌డి.. 20 మందికి క‌రోనా?

F3: కరోనా మ‌హ‌మ్మారి రోజురోజుకి తెగ విజృంభిస్తుంది. ఒమిక్రాన్ వల‌న కేసుల సంఖ్య బాగా పెరుగుతున్నాయి. సినిమా సెల‌బ్రిటీల‌కు ఈ సారి వ‌రుస పెట్టి పాజిటివ్ రావ‌డం ప‌ట్ల అందరు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మహేష్‌బాబు, థమన్‌, రాజేంద్రప్రసాద్‌, బండ్ల గణేష్‌, మంచు మనోజ్‌, విశ్వక్‌ సేన్‌ ఇలా అనేక మందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు షూటింగ్‌ సెట్‌లోనే కరోనా మహమ్మారి వెంటాడుతుందట.

F3 Movie: Venkatesh Daggubati and Varun Tej are back with F2 sequel;  Promise triple the fun this time | PINKVILLA

ఎఫ్‌ 3` సినిమా సెట్‌లో కరోనా కలకలం సృష్టించిందని తెలుస్తుంది. ఈ టీమ్ లో ఒక్క‌సారిగా 20 మంది క‌రోనా బారీన ప‌డ్డార‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. దాంతో… ఉన్న ఫళంగా షూటింగ్ ఆపేశారు. గ‌త రెండు రోజుల నుంచీ.. హైద‌రాబాద్ లో `ఎఫ్ 3` షూటింగ్ జ‌రుగుతోంది. ఎందుకైనా మంచిద‌ని టీమ్ స‌భ్యులంద‌రికీ ఒకేసారి క‌రోనా టెస్టులు చేయించింది చిత్ర‌బృందం.

దాంతో 20 మందికి క‌రోనా అని బ‌య‌ట‌ప‌డింది. వెంట‌నే షూటింగ్ కి పేక‌ప్ చెప్పేశారు. క‌రోనా భ‌యంతోనే వెంక‌టేష్ ముందే షూటింగ్ కి డుమ్మాకొట్టారట‌. ఆయ‌న లేని స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్న‌ప్పుడు ఈ క‌రోనా బ‌య‌ట‌ప‌డింది. తమన్నా, మెహరీన్‌ కూడా ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నట్టు టాక్. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇప్పుడీ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

f3-set-corona-spread-20-members1
f3-set-corona-spread-20-members1

`ఎఫ్‌2`కి సీక్వెల్‌గా `ఎఫ్‌3` రూపొందుతుంది. డబ్బుతో కూడిన ఫ్రస్టేషన్‌ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ హీరోహీరోయిన్లుగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో `ఎఫ్‌3` చిత్రం రూపొందుతుంది. ఇందులో మరో సర్‌ప్రైజింగ్‌ స్టార్స్ కూడా ఉంటారని టాక్‌. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 29న విడుదల చేయబోతున్నారు.