F3: రెండో రోజు ఎఫ్ 3 క‌లెక్ష‌న్స్ సంగ‌తేంటి.. ఎంత రాబ‌ట్టిందో తెలుసా?

NQ Staff - May 29, 2022 / 02:22 PM IST

F3: రెండో రోజు ఎఫ్ 3 క‌లెక్ష‌న్స్ సంగ‌తేంటి.. ఎంత రాబ‌ట్టిందో తెలుసా?

F3: స‌మ్మ‌ర్ సోగ్గాళ్లు వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ఎఫ్ 3 చిత్రంతో ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదం పంచేందుకు వ‌చ్చారు. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి మార్క్ చూపిస్తూ వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. పూర్తిగా జంధ్యాల, ఇవివి ట్రాక్‌లో తెరకెక్కించిన ఈ మూవీ చూస్తుంటే.. పాత కామెడీ సినిమాలు గుర్తుకు వస్తాయి. గత శుక్రవారం (మే 27) విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

F3 Second Day Box Office Collections

F3 Second Day Box Office Collections


వెంకటేష్, వరుణ్ తేజ్‌ల నటనపై పాజిటివ్ టాక్ వినిపించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి రోజుకు గాను 10.35Cr రాబట్టిన ఈ సినిమా రెండో రోజుకు వచ్చే సరికి 10 శాతం డ్రాప్ అయింది. రెండో రోజుకు గాను ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో కలిపి 8.35Cr నెట్ వసూళ్లు రాబట్టారు ఈ సమ్మర్ సోగ్గాళ్లు. గ్రాస్ చూస్తే 13.25Cr వచ్చినట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సినిమాకు 39.80Cr గ్రాస్, 23.50Cr నెట్ వసూళ్లు నమోదయ్యాయి.

నైజాం – 4.1 కోట్లు, ఉత్తరాంధ్ర – 1.05 కోట్లు, సీడెడ్ 1.15 కోట్లు, గుంటూరు – 54 లక్షలు, నెల్లూరు – 24 లక్షలు, కృష్ణ – 51 లక్షలు, వెస్ట్ గోదావరి – 29 లక్షలు, తూర్పు గోదావరి – 52 లక్షలు వ‌సూళ్లు వ‌చ్చాయి. మొత్తం రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 18.77 కోట్లు షేర్ ఐ రాబట్టి స్ట్రాంగ్ గా నిలిచింది. ఇక ఈ ఆదివారం కూడా మంచి నెంబర్ సెట్ చేసే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా దిల్ రాజు నిర్మాణం అందించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియోస్ మూవీపై భారీ బజ్ క్రియేట్ చేయడంతో ఓవరాల్‌గా బిజినెస్ 63.60Cr ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో 64.50Cr బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బరిలోకి దిగిన ఈ సమ్మర్ సోగ్గాళ్లు మరో 41Cr రాబడితే సక్సెస్ అయినట్టే. ఇకపోతే ఈ F3 సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్‌లోను అదరగొడుతోంది. అక్కడ కూడా చెప్పుకోదగిన నంబర్స్ కనిపిస్తున్నాయి.

ఈ సినిమాలో రే చీకటితో బాధపడే వ్యక్తిగా వెంకటేష్, నత్తితో బాధపడే వ్యక్తిగా వరుణ్ తేజ్ నటించి కడుపుబ్బా నవ్వించారు. వెంకటేష్‌కు జోడీగా తమన్నా నటించగా.. వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ ఆడిపాడింది. మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు.

Read Today's Latest బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us